తెలంగాణలో మరో రెండు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయని, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇండియన్ మెటెరొలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఐఎండీ హైదరాబాద్ డైరెక్టర్ కె.నాగరత్నం మీడియాకు వివరాలను వెల్లడించారు.
రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి లేదా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అన్నారు.
అదేవిధంగా రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్), జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అన్నారు.
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని అన్నారు. ఆగస్టు 19, 20 తేదీల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…