కొన్నిసార్లు కొంతమందికి అదృష్టం సుడి తిరిగినట్టు తిరుగుతుంటుంది. ఇలా అదృష్టం పట్టినప్పుడు వారికి తెలియకుండానే లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారిపోతుంటారు. ఇలాంటి అదృష్టం తాజాగా ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసింది. విచిత్రమేమిటంటే ఎక్కడైతే తను తప్పతాగి పడిపోయాడో ఆ బార్ నుంచి ఏకంగా రూ.40 కోట్ల నష్టపరిహారాన్ని రాబట్టిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళ్తే..
2019 మే నెలలో టెక్సాస్‌కు చెందిన డానియల్ రాల్స్ అనే వ్యక్తి ఒక రోజు ఆండ్రూస్‌లోని లా ఫగోటా మెక్సికన్ గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఫుల్‌గా తాగాడు. తాగిన మత్తులో ఆ వ్యక్తి కార్ పార్కింగ్ వద్ద మరో వ్యక్తితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే డానియల్ తలకు తీవ్రంగా గాయమైంది. ఈ విధంగా గాయపడిన డానియల్ ఆస్పత్రిలో చేరి చికిత్స అనంతరం సదరు బార్ అండ్ రెస్టారెంట్ పై కోర్టులో కేసు వేశాడు. కేవలం ఆ రెస్టారెంట్ నిర్లక్ష్యం కారణంగానే ఈ విధమైనటువంటి గాయం తగిలిందని ఆరోపించాడు.
రెస్టారెంట్ సిబ్బంది తనకు అధికమొత్తంలో మందు తాపించి ఈ గొడవకు కారణం అయ్యారని, గొడవ పడుతున్న సమయంలో రెస్టారెంట్ యాజమాన్యం ఏ విధంగానూ స్పందించకపోవడమేకాకుండా, తలకు గాయంతో బాధపడుతుంటే అంబులెన్స్ కు కూడా ఫోన్ చేయలేదని ఆరోపించాడు. ఈ క్రమంలోనే రెస్టారెంట్ యాజమాన్యం కూడా న్యాయవాదులను పెట్టి కోర్టులో వాదించినప్పటికీ కోర్టు మాత్రం డానియల్ కి అండగా నిలబడింది. ఈ క్రమంలోనే సదరు బార్ యాజమాన్యం నిర్లక్ష్యంగా ప్రవర్తించిన కారణంగా డానియల్ కు ఐదు మిలియన్ల డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ విధంగా తీర్పు రావడంతో డానియల్ దశ మారిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పలువురు నెటిజన్లు లక్ష్మీ పుత్రుడు అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…