వాట్సాప్‌లో మెసేజ్‌లను డిలీట్ చేసే ఫీచర్ అందుబాటులో ఉన్న విషయం విదితమే. వాట్సాప్ ఈ ఫీచర్‌ను 2017లోనే అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సహాయంలో వాట్సాప్‌లో పంపే మెసేజ్‌లతోపాటు ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయవచ్చు. కానీ వాటిని పంపిన 7 నిమిషాల్లోగా డిలీట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే అవి డిలీట్ కావు. అయితే ఆయా మెసేజ్‌లను పొరపాటుగా డిలీట్ చేస్తే ఇంక అంతే సంగతులు. వాటిని మళ్లీ యాక్సెస్ చేయలేం. అలాగే ఇతరులు మనకు పంపే మెసేజ్‌లను వారు డిలీట్ చేసినా వాటిని మనం చూడలేం. కానీ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఓ యాప్ సహాయంతో వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను కూడా చూడవచ్చు. అందుకు గాను ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న నోటిసేవ్ (Notisave) అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. అనంతరం యాప్‌ను ఓపెన్ చేసి అన్ని పర్మిషన్లను ఇవ్వాలి. దీంతో మీ వాట్సాప్‌కు వచ్చే అన్ని రకాల మెసేజ్‌లను ఈ యాప్ ట్రాక్ చేస్తుంది. వాటిని తన దగ్గర స్టోర్ చేసుకుంటుంది. ఈ క్రమంలో వాట్సాప్‌లో ఏ మెసేజ్‌లను అయినా సరే డిలీట్ చేస్తే వాటిని నోటిసేవ్ యాప్‌లో చూడవచ్చు. ఇలా ఈ యాప్ పనిచేస్తుంది.
ఈ యాప్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఫ్రీ వెర్షన్‌లో యాడ్స్ వస్తాయి. కానీ రూ.65 పెట్టి పెయిడ్ వెర్షన్‌ను కొనుగోలు చేస్తే యాడ్స్ రాకుండా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్‌లో డిలీట్ చేయబడిన మెసేజ్‌లను చదివేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…