మొదటి సారి తల్లి తండ్రి అవుతున్న దంపతులకు ఎంతగానో థ్రిల్ అనిపిస్తుంది. వారు పుట్టబోయే తమ బిడ్డ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక మహిళలకు అయితే మొదటి సారి తల్లి అయితే కలిగే ఆనందమే వేరు. తనలో పెరుగుతున్న తన చిన్నారి ఎప్పుడు బయటకు వస్తుందా ? ఎప్పుడు తనతో ఆడుకుందామా ? అని తల్లులు ఎదురు చూస్తారు. మాతృత్వం అనేది మహిళలకు మాత్రమే లభించే గొప్ప వరం. అయితే బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఒక్కోసారి తన్నడం జరుగుతుంది. బిడ్డ కదలికలు తల్లికి స్పష్టంగా తెలుస్తాయి. అయితే ఇలా ఎలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?
కడుపులో ఉన్న బిడ్డ తన్నడాన్ని చాలా మంది మహిళలు గొప్పగా భావిస్తారు. అయితే నిజానికి బిడ్డ తన్నడం అనేది అత్యంత సహజమైన ప్రక్రియ. గర్భం దాల్చిన మహిళకు 20-30 వారాల గర్భం సమయంలో బిడ్డ తన్నడం జరుగుతుంది. 35 వారానికి ఆ ప్రక్రియ ఆగుతుంది. బిడ్డకు ఆ సమయంలో ఎముకలు పెరుగుతుంటాయి. కీళ్లలో మార్పులు వస్తాయి. అందుకనే బిడ్డ కడుపులో అటు తిరుగుతూ తన్నడం జరుగుతుంది. మనం కొద్ది సేపు కూర్చుంటేనే కాళ్లను చాపాలనిపిస్తుంది. కడుపులో ఉన్న బిడ్డకు కూడా అంతే. అలా తన్నుతుంటేనే సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే వారు అలా చేస్తారు.
అయితే కడుపులో ఉన్న బిడ్డ ఎంత ఎక్కువ తన్నితే వారు అంత ఆరోగ్యంగా ఉంటారట. అలా అని సైంటిస్టులే చెబుతున్నారు. ఈ మేరకు కొందరు సైంటిస్టులు అధ్యయనాలు కూడా చేపట్టారు. కడుపులో బాగా తన్నేవారికి నాడీ మండల సంబంధిత సమస్యలు రావని, వారు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. కనుక కడుపులో ఉన్న బిడ్డ తంతుంటే వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారని అర్థం చేసుకోండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…