ట్విట్టర్ యూజర్లకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో దిగ్గజ సంస్థ అయిన ట్విట్టర్ తమ యూజర్లకు శుభవార్తను తెలిపింది. ఇకపై ట్విట్టర్ వాడే ప్రతి ఒక్కరూ ఈ సరికొత్త ఫీచర్ ద్వారా నెల నెలా డబ్బులు సంపాదించవచ్చు. ట్విట్టర్ సూపర్ ఫాలోస్ అనే సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు రావడంతో యూజర్లు ఈ ఫీచర్ ద్వారా నెల నెలా ఆదాయం పొందవచ్చు.
ట్విట్టర్ వాడే యూజర్లు కంటెంట్ షేరింగ్ చేస్తూ డబ్బును సంపాదించవచ్చు. సాధారణ యూజర్లు, జర్నలిస్టులు, క్రీడాకారులు, స్కిన్ కేర్ బ్యూటీ ఎక్స్‌పర్ట్స్, జ్యోతిష్య ప్రియులు, సంగీత కళాకారులు, క్రీడా నిపుణులు మొదలైనవారు ఈ సరికొత్త ఫీచర్ ద్వారా కంటెంట్ ను క్రియేట్ చేసి ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తే డబ్బులు సంపాదించవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం అమెరికా, కెనడాలో కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఇతర దేశాల్లోని యూజర్లకు కూడా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ట్విట్టర్ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ ఫీచర్ కోసం అప్లై చేయాలంటే కొన్ని అర్హతలను కూడా కలిగి ఉండాలి. 18 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే ఈ ఫీచర్ కోసం అప్లై చేయాలి. అదేవిధంగా ట్విట్టర్‌లో కనీసం పదివేల మంది ఫాలోవర్స్ ను కలిగి ఉండాలి. నెలకు కనీసం 25 సార్లు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తూ ఉండాలి. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు 2.99, 4.99, 9.99 డాలర్లతో ప్రతి నెలా సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…