భార‌త‌దేశం

బ్రిటిష్‌ కాలం నాటి సొరంగం ఢిల్లీ అసెంబ్లీ భవనంలో గుర్తింపు.. అక్కడి నుంచి దారి ఎర్ర కోట వరకు ఉంది.. ఫొటోలు..!

బ్రిటిషర్లు మన దేశంలో మొదటిసారి అడుగు పెట్టిన తరువాత చాలా ఏళ్ల పాటు కోల్‌కతాను రాజధానిగా చేసుకుని పాలించారు. తరువాత రాజధానిని ఢిల్లీకి మార్చారు. అయితే అక్కడ వారు ఉపయోగించిన ఓ భవనాన్ని ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ భవనంగా వాడుతున్నారు. ఆ భవనంలో తాజాగా ఓ సొరంగ మార్గం బయట పడింది. దాని నుంచి దారి ఢిల్లీలోని ఎర్ర కోట వరకు ఉండడం విశేషం.

ఢిల్లీ అసెంబ్లీ భవనంలో తాజాగా ఓ సొరంగ మార్గాన్ని గుర్తించారు. దీనిపై స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయెల్‌ మాట్లాడుతూ.. 1993లోనే తనకు ఈ విషయం తెలుసని అన్నారు. అయితే అప్పట్లో దీని గురించి చదివానని, కానీ ఆధారాలు లభించలేదని అన్నారు. కానీ తాజాగా ఇప్పుడే సొరంగాన్ని కనుగొన్నామని తెలిపారు. సొరంగ మార్గం మొత్తాన్ని గుర్తించామని, అది అసెంబ్లీ నుంచి ఢిల్లీలోని ఎర్ర కోట వరకు ఉందని తెలిపారు.

అయితే సొరంగంలో ప్రస్తుతం కొంత వరకు భాగం మాత్రమే ఖాళీగా ఉందని, మిగిలిన భాగంలో మట్టి, భవన నిర్మాణ వ్యర్థాలు నిండిపోయాయని, అందువల్ల సొరంగంలో ఇప్పుడు వెళ్లలేమని తెలిపారు. కానీ దాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టామని అవి 2022 ఆగస్టు 15 వరకు పూర్తవుతాయని అన్నారు. దీంతో ఆ సొరంగంలో పర్యాటకులు ప్రయాణించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

అయితే 1912వ సంవత్సరంలో బ్రిటిష్‌ వారు తమ రాజధానిని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చగా అప్పటి నుంచి ఈ భవనంలోనే వారు ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహించడం మొదలు పెట్టారు. ఈ భవనాన్ని అప్పట్లో వారు కోర్టుగా ఉపయోగించారు. వారు ఎర్ర కోట నుంచి పలువురు స్వాతంత్య్ర సమర యోధులను సొరంగ మార్గం ద్వారా ఈ కోర్టుకు తెచ్చి వారికి శిక్షలు విధించేవారు. తరువాత ఈ మార్గం ద్వారానే వాళ్లను బయటకు తరలించేవారు.

కానీ కాలక్రమేణా దాని గురించిన వివరాలు చరిత్రలో మరుగున పడిపోవడంతోపాటు సొరంగ మార్గం చాలా వరకు పూడుకుపోయింది. ఈ క్రమంలో తాజాగా ఆ సొరంగాన్ని మళ్లీ గుర్తించారు. దీంతో దాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టారు.

అయితే సదరు సొరంగం మార్గం ఎంత పొడవు ఉంటుందో తెలియదు కానీ దాన్ని పూర్తిగా పునరుద్ధరించాక అన్ని వివరాలు తెలుస్తాయి. ఇక ఆ సొరంగాన్ని అందుబాటులోకి తెస్తే స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటాల గురించి మనకు కళ్లకు కట్టినట్లు తెలుస్తుందని స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయెల్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా ఈ సొరంగ మార్గం గురించి ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM