బీహార్‌కు చెందిన జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్‌పై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన రైలులో అండర్‌వేర్‌తో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా వారిపై బెదిరింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే ఓ ప్రయాణికుడికి చెందిన బంగారు ఆభరణాలు, నగదును కూడా ఆయన లాక్కున్నారని ప్రయాణికులు ఆరోపించారు. దీంతో రైల్వే పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..
బీహార్ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ గురువారం పాట్నా నుంచి న్యూఢిల్లీకి తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. ఆయనతోపాటు మరో ఇద్దరు కూడా వెంట ఉన్నారు. ఈ క్రమంలోనే వారు రైలులో సెకండ్ ఏసీ ఎ1 బోగీలో 13, 14, 15 నంబర్ బెర్తుల్లో ప్రయాణిస్తున్నారు.
అయితే రైలు ఉత్తరప్రదేశ్‌లోని దిల్దార్‌నగర్ స్టేషన్‌ను దాటిన తరువాత ఎమ్మెల్యే గోపాల్ మండల్ షర్ట్, ప్యాంట్ విప్పి కేవలం బన్నీను, అండర్‌వేర్ తో రైలులో చాలా సేపు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రవర్తన పట్ల తోటి ప్రయాణికులు అభ్యంతరం చెప్పగా వారిపై ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు. కాగా ఓ ప్రయాణికుడు ధైర్యం చేసి ఆయన్ను ప్రశ్నించగా అతని నుంచి బంగారు చెయిన్, ఉంగరం, డబ్బును ఎమ్మెల్యే లాక్కున్నారు.
ఈ క్రమంలో ఆ ప్రయాణికుడు రైల్వే పోలీసులకు పై విషయాలను తెలియజేస్తూ ఫిర్యాదు చేశాడు. అంతేకాదు ఆ సమయంలో ఆ ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నాడని కూడా ఆ ప్రయాణికుడు తెలిపాడు. తమను బెదిరించడమే కాకుండా, తన దగ్గర ఉన్న బంగారం, నగదును ఎమ్మెల్యే లాక్కున్నాడని ఆ ప్రయాణికుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే గోపాల్ మండల్‌పై కేసు నమోదు చేశారు. ఆ కేసును బీహార్‌లోని బక్సర్‌కు బదిలీ చేశారు.
కాగా ఆ ఎమ్మెల్యే అలా రైలులో తిరుగుతున్నప్పుడు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అతని ప్రవర్తన పట్ల నెటిజన్లు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇలా నీచంగా ప్రవర్తించాడని విమర్శిస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ విషయంపై సదరు ఎమ్మెల్యే గోపాల్ మండల్ స్పందిస్తూ.. తనకు ప్రయాణంలో విరేచనాలు అయ్యాయని, అందుకనే అలా అండర్‌వేర్‌లో ఉండాల్సి వచ్చిందని చెప్పారు. కానీ ప్రయాణికులందరూ ముక్త కంఠంతో ఆయనపై ఆరోపణలు చేశారు. తమపై ఆయన బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…