Jio Rs 198 Prepaid Plan : టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఓ సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ 5జిని వాడుకునేలా ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు గాను కస్టమర్లు రూ.198తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ 5జి మొబైల్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 14 రోజులుగా ఉంది.
జియో అందిస్తున్న రూ.198 ప్లాన్ ద్వారా కస్టమర్లు రోజుకు 2 జీబీ 4జి డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను ఉచితంగా అందిస్తారు. అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి యాప్స్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. ఇక జియోలో అన్‌లిమిటెడ్ 5జి యాక్సెస్‌తో లభిస్తున్న అత్యంత చవకైన ప్లాన్ ఇదే కావడం విశేషం. అయితే దీన్ని నెలలో 2 రోజులు రీచార్జి చేసుకోవాలి. దీంతో కస్టమర్లకు రూ.396 అవుతుంది. కానీ రూ.349 చెల్లిస్తే ఇదేలాంటి బెనిఫిట్స్‌తో 28 రోజుల వాలిడిటీ పొందవచ్చు. మరలాంటప్పుడు జియో రూ.198 ప్లాన్‌ను ఎందుకు అందుబాటులోకి తెచ్చింది అన్నది అర్థం కాని విషయం.
జియో రూ.349 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ 5జి డేటాను వాడుకోవచ్చు. 4జి డేటా అయితే రోజుకు 2జీబీ డేటాను వాడుకోవచ్చు. దీంట్లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఉచిత జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి. అయితే ఎయిర్‌టెల్‌లో ఇదే ప్లాన్ కాస్త ఎక్కువ ధరను కలిగి ఉంది. ఎయిర్‌టెల్‌లో ఇందుకు కస్టమర్లు రూ.379 చెల్లించాలి. కానీ దీంట్లో 30 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇక బెనిఫిట్స్ మాత్రం జియోలో రూ.349 ప్లాన్‌ను పోలి ఉంటాయి. ఇలా కస్టమర్లు తమకు కావల్సిన ప్లాన్‌ను రీచార్జి చేసుకుని ఆ మేర అన్‌లిమిటెడ్ 5జి డేటాను యాక్సెస్ చేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…