Natural Home Remedies For Acidity : అసిడిటీ సమస్య అనేది చాలా మందికి తరచుగానే వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. కారం, మసాలు ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం, రాత్రి పూట ఆలస్యంగా తినడం లేదా అతిగా భోజనం చేయడం, సరిగ్గా జీర్ణం అవకపోవడం, ఒత్తిడి, ఆందోళన, పలు రకాల మెడిసిన్లను వాడడం వంటి పలు కారణాల వల్ల చాలా మందికి అసిడిటీ వస్తుంది. దీంతో కడుపులో మంటగా ఉంటుంది. అదే తగ్గే వరకు తీవ్రమైన అసౌకర్యంగా ఉంటుంది. దీంతో కడుపులో మంటతో చాలా మంది నానా అవస్థలు పడతారు.
అసిడిటీ సమస్య రాగానే చాలా మంది మెడికల్ షాపుకు వెళ్లి అంటాసిడ్ ట్యాబ్లెట్లను లేదా గ్యాస్ ట్యాబ్లెట్లను తెచ్చి వేసుకుంటారు. దీంతో సమస్య తగ్గుతుంది. కానీ దీర్ఘకాలికంగా వీటిని వాడడం అంత మంచిది కాదు. వీటి వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కనుక అసిడిటీని సహజసిద్ధమైన మార్గంలో తగ్గించుకునే పనిచేయాలి. ఇందుకు గాను కింద చెప్పబోయే ఇంటి చిట్కాలు ఎంతగానో పనిచేస్తాయి. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కడుపులో మంట ఉన్నవారు అల్లాన్ని ఎక్కువగా ఉపయోగించాలి. భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను అలాగే నమిలి మింగాలి. లేదా ఒక టీస్పూన్ అల్లం రసం సేవించవచ్చు. అల్లం ముక్కను వేసి మరిగించిన నీళ్లను తాగుతున్నా కూడా అసిడిటీ తగ్గిపోతుంది. అలాగే కడుపులో మంటను తగ్గించేందుకు కలబంద జ్యూస్ కూడా అద్బుతంగా పనిచేస్తుంది. భోజనానికి 30 నిమిషాల ముందు ఈ జ్యూస్‌ను కనీసం 30 ఎంఎల్ మోతాదులో తాగుతుంటే కడుపులో మంట సమస్య రాదు.
ఇక భోజనం చేసిన అనంతరం గుప్పెడు సోంపు గింజలను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగుతున్నా కూడా అన్ని రకాల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పాలు కూడా అసిడిటీని తగ్గించగలవు. కానీ చల్లని పాలను తాగాల్సి ఉంటుంది. వేడి పాలు అయితే అసిడిటీని పెంచుతాయి. చల్లని పాలు అసిడిటీని తగ్గిస్తాయి. ఇక కొబ్బరి నీళ్లను తాగుతున్నా కూడా అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. అరటి పండు సహజసిద్ధమైన అంటాసిడ్‌లా పనిచేస్తుంది. కనుక కడుపులో మంట ఉన్నవారు పూటకు ఒక అరటి పండును తింటుంటే సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. ఇలా ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…