గ్యాడ్జెట్స్

12జీబీ ర్యామ్‌, స్నాప్‌డ్రాగ‌న్ 888 ప్రాసెస‌ర్‌తో లాంచ్ అయిన షియోమీ ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌..!

మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. ఎంఐ 11 అల్ట్రా పేరిట ఓ నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో తాజాగా విడుద‌ల చేసింది. ఇందులో 6.81 ఇంచుల అమోలెడ్ క్వాడ్ క‌ర్వ్‌డ్ డాట్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది. డిస్‌ప్లేకు డాల్బీ విజ‌న్ స‌పోర్ట్‌ను కూడా అందిస్తున్నారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ ల‌భిస్తుంది. ఇక 1.1 ఇంచుల సైజ్ ఉన్న మ‌రో సెకండ‌రీ అమోలెడ్ డిస్‌ప్లేను కూడా ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. దీని స‌హాయంతో నోటిఫికేష‌న్లు చెక్ చేయ‌వ‌చ్చు. సెల్ఫీల‌ను ప్రివ్యూ చూడ‌వ‌చ్చు.

ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 888 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 12 జీబీ వ‌ర‌కు ర్యామ్ ల‌భిస్తుంది. వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 48 మెగాపిక్స‌ల్ అల్ట్రావైడ్ కెమెరా, 48 మెగాపిక్స‌ల్ టెలిఫొటో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్ ల‌భిస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఇందులో ఏర్పాటు చేశారు. దీనికి 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌, 67 వాట్ల వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఈ ఫోన్ కేవ‌లం 36 నిమిషాల్లోనే పూర్తిగా చార్జింగ్ అవుతుంది. ఇక ఫోన్‌తోపాటు 55 వాట్ల చార్జర్‌ను అందిస్తారు. 67 వాట్ల చార్జ‌ర్‌ను త్వ‌ర‌లోనే లాంచ్ చేయ‌నున్నారు.

షియోమీ ఎంఐ 11 అల్ట్రా ఫీచ‌ర్లు

  • 6.81 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 3200×1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, డాల్బీ విజ‌న్‌, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, 1.1 ఇంచ్ అమోలెడ్ రియ‌ర్ ట‌చ్ డిస్‌ప్లే
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 888 ప్రాసెస‌ర్‌, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్
  • ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌, 50, 48, 48 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
  • ఇన్ స్క్రీన్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్
  • 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
  • 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ రివ‌ర్స్ చార్జింగ్

షియోమీ ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ సెరామిక్ బ్లాక్‌, సెరామిక్ వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్లలో విడుద‌లైంది. ఈ ఫోన్ ధ‌ర రూ.69,999గా ఉంది. దీన్ని త్వ‌ర‌లోనే అమెజాన్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్‌లలో విక్ర‌యించ‌నున్నారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM