శాంసంగ్ సంస్థ గెలాక్సీ ట్యాబ్ ఎ7 లైట్, గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ పేరిట రెండు నూతన ఆండ్రాయిట్ ట్యాబ్లెట్‌లను భారత్‌లో విడుదల చేసింది. ఈ రెండింటిలో అందిస్తున్న ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ ఫీచర్లు
- 12.4 ఇంచ్ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2560 x 1600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 750 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
- 1 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్
- 8, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, డ్యుయల్ స్పీకర్లు, డాల్బీ అట్మోస్
- ఎస్ పెన్ విత్ బ్లూటూత్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0
- యూఎస్‌బీ టైప్ సి, 10,090 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ7 లైట్ ఫీచర్లు
- 8.7 ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 1340×800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 టి ప్రాసెసర్, 3జీబీ ర్యామ్
- 32 జీబీ స్టోరేజ్, 1 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్
- 8, 2 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, డ్యుయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్
- 4జి ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైపై, బ్లూటూత్ 5.0
- 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ ట్యాబ్ మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ సిల్వర్, మిస్టిక్ గ్రీన్, మిస్టిక్ పింక్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ఈ ట్యాబ్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.46,999గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.50,999గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ7 లైట్ ట్యాబ్ కు చెందిన వైఫై మోడల్ ధర రూ.11,999 ఉండగా, ఎల్‌టీఈ మోడల్ ధర రూ.14,999గా ఉంది.
ఈ రెండు ట్యాబ్‌లపై లాంచింగ్ ఆఫర్లను అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ఈ ట్యాబ్‌లను కొనుగోలు చేస్తే రూ.4వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే కీబోర్డు కవర్ మీద రూ.10వేల తగ్గింపు ధర లభిస్తుంది. గెలాక్సీ ట్యాబ్ ఎ7 లైట్ ట్యాబ్‌ను 6 నెలల నోకాస్ట్ ఈఎంఐ సదుపాయంతో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లతోపాటు లీడింగ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ ట్యాబ్‌లను ఈ నెల 23వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు.