ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన నటన ద్వారా నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నాని ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఇప్పటికే నాని నటించిన “టక్ జగదీష్” విడుదలకు సిద్ధంగా ఉండగా మరో రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కరోనా కారణం వల్ల ఈ సినిమాలన్నీ వాయిదా పడ్డాయి.
ఈ క్రమంలోనే నాచురల్ స్టార్ నాని కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా మారి కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. తాజాగా నాని నిర్మాతగా తన బ్యానర్ వాల్‌పోస్టర్ సినిమాపై నాలుగో సినిమాగా ‘మీట్ క్యూట్’ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని నిర్మాతగా వ్యవహరించగా తన అక్క దీప్తి ఘంటా దర్శకురాలిగా పరిచయం కానున్నారు.
తాజాగా నాని నిర్మాణంలో తెరకెక్కే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ నటించనున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు స్టార్ హీరోయిన్స్ కాక మరో ఇద్దరు కొత్తవాళ్లను తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆ హీరోయిన్స్ ఎవరు ఏమిటి అనే విషయాలను ఒక్కొక్కరినిగా నాని రివీల్ చేస్తూ వస్తారని తెలుస్తోంది.అయితే ఈ సినిమాను కేవలం 30 రోజుల లోగా పూర్తి చేయాలని షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.నాని నిర్మాణంలో తెరకెక్కె ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాలి అని తెలుస్తోంది.