మొబైల్స్ తయారీ కంపెనీ పోకో భారత్ లో పోకో ఎక్స్3 ప్రొ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ను అందిస్తున్నారు. ఈ ఫోన్ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్‌ను అమర్చారు. 8జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ఇందులో లిక్విడ్ కూలింగ్ 1.0 ప్లస్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ ఫోన్‌తో గేమ్స్ ఆడినా, వీడియోలు చూసినా పెద్దగా హీట్ అవ్వదు. ఈ ఫోన్‌లో వినియోగదారులకు ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది.
ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సల్ పోర్ట్రెయిట్ షాట్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 20 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్కన ఉంటుంది. ఈ ఫోన్‌లో 5160 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అమర్చారు. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అందువల్ల ఫోన్ కేవలం 59 నిమిషాల్లోనే 0 నుంచి 100 శాతం చార్జింగ్ పూర్తవుతుంది.
పోకో ఎక్స్3 ప్రొ ఫీచర్లు
- 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
- 1080 × 2400 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
- గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, 2.96 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్
- 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 1 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 11, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
- 48, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్
- డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, వీవోవైఫై
- బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ
- 5160 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్
పోకో ఎక్స్3 ప్రొ స్మార్ట్ ఫోన్ గ్రాఫైట్ బ్లాక్, స్టీల్ బ్లూ, గోల్డెన్ బ్రాంజ్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.18,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.20,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఈఎంఐ సదుపాయం లభిస్తుంది.