దేశంలో 5జి స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. అందులో భాగంగానే కంపెనీలు 5జి ఫోన్లను తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇక తాజాగా ఒప్పో కూడా మరో రెండు 5జి ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. ఒప్పో రెనో 6, రెనో 6 ప్రొ పేరిట రెండు 5జి ఫోన్లు విడుదలయ్యాయి. వీటిల్లో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు.
ఒప్పో రెనో6 5జి ఫీచర్లు
- 6.5 ఇంచుల డిస్‌ప్లే, ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్
- గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్
- 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11, డ్యుయల్ సిమ్
- 64, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ
- బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
- 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ల ఫాస్ట్ చార్జింగ్
ఒప్పో రెనో 6 ప్రొ 5జి ఫీచర్లు
- 6.55 ఇంచుల డిస్‌ప్లే, ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
- ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 11, డ్యుయల్ సిమ్, 64, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
- 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
- 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సి
- 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ల ఫాస్ట్ చార్జింగ్
కాగా ఒప్పో రెనో6 5జి ఫోన్ ధర రూ.29,990 గా ఉంది. అలాగే ఒప్పో రెనో 6 ప్రొ 5జి ఫోన్ ధరను రూ.39,990గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈనెల 23వ తేదీ నుంచి ఈ ఫోన్లు లభిస్తాయి.