ఎనర్జిటిక్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ పోతినేని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. 2019 వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా తనలో ఉన్న మాస్ యాంగిల్ బయట పెట్టి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అదేవిధంగా రెడ్ చిత్రం కూడా ప్రేక్షకులను అలరించింది.ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు రావడంతో రామ్ ఇదే సరైన అదునుగా భావించి అమాంతం తన రెమ్యూనరేషన్ పెంచేశారు.
ప్రస్తుతం హీరో రామ్ తన 19 వ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాలో నటించడం కోసం రామ్ ఏకంగా 13 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.గతంలో ఒక్కో సినిమాకు 10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే రామ్ ఏకంగా మూడు కోట్ల రెమ్యూనరేషన్ పెంచడంతో ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
లింగుస్వామి దర్శకత్వంలో ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ ఈ సినిమాని నిర్మించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.RAPO 19 పేరుతో రామ్- లింగుస్వామి కాంబో సెట్స్ పైకి వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ పాత్రలో సందడి చేస్తున్నారు.