మొబైల్స్ తయారీదారు హెచ్ఎండీ గ్లోబల్ నోకియా జి20 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెసర్‌ను అమర్చారు. 4జీబీ ర్యామ్ లభిస్తుంది. 64జీబీ స్టోరేజ్ వస్తుంది. మెమొరీని కార్డు ద్వారా 512జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. 2 ఏళ్ల వరకు సాఫ్ట్‌వేర్ అప్ గ్రేడ్స్ లభిస్తాయి. 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్ ను అందిస్తారు. వెనుక వైపు 4 కెమెరాలు ఉన్నాయి. 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా కాగా 5, 2, 2 మెగాపిక్సల్ కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఈ ఫోన్‌లో డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేక బటన్‌ను ఏర్పాటు చేశారు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఇందులో 5050 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు.
నోకియా జి20 ఫోన్ ధర రూ.12,999గా ఉంది. అమెజాన్‌తోపాటు నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లో జూలై 7 నుంచి విక్రయిస్తారు. ఫోన్‌ను ప్రీ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు.