కందిపప్పుతో సహజంగానే చాలా మంది పప్పు వండుకుంటారు. కొందరు కందిపొడి తయారు చేస్తారు. కందిపప్పుతో చేసే ఏ వంటకమైనా సరే ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. ఈ క్రమంలోనే కంది పప్పుతో ఇడ్లీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కంది ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు
- దొడ్డు బియ్యం – మూడు కప్పులు
- కందిపప్పు – ఒకటిన్నర కప్పు
- మినపపప్పు – అర కప్పు
- ఉప్పు – తగినంత
తయారు చేసే విధానం
బియ్యం, మినపపప్పులను కలిపి, కందిపప్పును విడిగా ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టుకోవాలి. తరువాత కందిపప్పును నీళ్లు లేకుండా రుబ్బుతూ కొంచెం మెదిగాక నీళ్లు పోసి బియ్యం, మినపపప్పు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత ఉప్పు వేసి కలిపి రెండు గంటల పాటు నానబెట్టిన తరువాత కుక్కర్‌లో ఇడ్లీలు వేసుకోవాలి. దీంతో రుచికరమైన కంది ఇడ్లీలు తయారవుతాయి. వాటిని మీకు నచ్చిన చట్నీతో లాగించేయవచ్చు.