హెచ్ఎడీ గ్లోబల్ సంస్థ నోకియా సి20 ప్లస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. 3జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్, 2 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తున్నాయి. వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ఇంకో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌ను ఇచ్చారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్లో 4950 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు.
నోకియా సి20 ప్లస్ ఫీచర్లు
- 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే, 1600 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
- 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్, డ్యుయల్ సిమ్
- 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 4950 ఎంఏహెచ్ బ్యాటరీ
నోకియా సి20 ప్లస్ ఫోన్ కు చెందిన 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8,999గా ఉంది. అదే 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర అయితే రూ.9,999గా ఉంది. ఈ ఫోన్‌ను అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు.
జియో కస్టమర్లు 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. ఇతర రాయితీలు, వోచర్లను కూడా అందిస్తున్నారు.