Shravana Masam: సాధారణంగా ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో చాలా మంది భక్తులు కొన్ని నియమ నిష్టలను పాటిస్తారు. ఈ క్రమంలోనే కొందరి ఈ మాసమంతా ఎలాంటి మాంసాహారం ముట్టుకోరు. అదేవిధంగా మరికొందరు పాలు పెరుగు వంటి ఆహార పదార్థాలను తినరు. మరికొందరు ఉల్లిపాయ వెల్లుల్లి వేసిన ఆహారపదార్థాలను ముట్టుకోరు. అయితే శ్రావణమాసంలో పాలు పెరుగు తినకపోవడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు సాగర మధనం చేస్తున్నప్పుడు సముద్రగర్భం నుంచి కాలకూట విషం బయట పడుతుంది. ఈ విషం వల్ల ఎంతో ప్రమాదం వాటిల్లుతుందని భావించిన పరమేశ్వరుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలోనే ఉంచుకుంటాడు. అందుకే ఈ మాసంలో చాలామంది పరమేశ్వరుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. అందుకే ఈ నెల మొత్తం చాలా మంది పాలు తాగకుండా ఆ పరమేశ్వరునికి అభిషేకాలు నిర్వహించి పూజలు చేస్తారు.
ఆధ్యాత్మికపరంగా పరమేశ్వరుడి అభిషేకం కోసం పాలు తాగమని చెబుతారు. అదే సైన్స్ పరంగా అయితే వర్షాకాలంలో శ్రావణమాసం రావటం వల్ల గడ్డి మొత్తం పురుగులు పడి ఉంటుంది.ఇలాంటి గడ్డిని పశువుల తిన్నప్పుడు పశువుల నుంచి వచ్చే పాలను మనం త్రాగటం వల్ల అనేక వ్యాధులు వస్తాయని భావించి ఈ నెల మొత్తం పాలు తాగకుండా ఉంటారని సైన్స్ చెబుతోంది.