మొబైల్స్ తయారీదారు లావా.. జడ్2 మ్యాక్స్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 7 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. 2జీబీ ర్యామ్ లభిస్తుంది. వెనుక వైపు 13, 2 మెగాపిక్సల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు.
ఈ ఫోన్‌లో ఇన్‌బిల్ట్ బాక్స్ స్పీకర్స్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల సౌండ్ పెద్దగా, క్లియర్‌గా వస్తుంది. ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తోంది.
లావా జడ్2 మ్యాక్స్ ఫీచర్లు
- 7 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ హీలియో ఎ20 ప్రాసెసర్
- 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్
- డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
లావా జడ్2 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ స్ట్రోక్డ్ బ్లూ, స్ట్రోక్డ్ క్యాన్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. రూ.7799 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.