ఐటెల్ కంపెనీ మ్యాజిక్ 2 4జి (ఐటీ9210 మోడల్) పేరిట ఓ నూతన 4జి ఫీచర్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. మ్యాజిక్ సిరీస్‌లో వచ్చిన ఐటెల్ తొలి 4జి ఫీచర్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో వైఫై, హాట్ స్పాట్‌కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను వైఫై హాట్ స్పాట్‌గా ఉపయోగించుకోవచ్చు. 8 డివైస్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈకి ఇందులో సపోర్ట్ లభిస్తుంది. 2.4 ఇంచుల క్యూవీజీఏ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 128 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మెమోరీని కార్డు ద్వారా 64జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఈ ఫోన్‌లో కింగ్ వాయిస్ అనే ఐటెల్ మొబైల్ ఫీచర్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తున్నారు. దీంతో యూజర్లు ఇన్‌కమింగ్ కాల్స్, మెసేజ్‌లు, మెను, ఫోన్‌బుక్‌లోని కాంటాక్ట్‌లను టెక్ట్స్ టు స్పీచ్ రూపంలో వినవచ్చు. ప్రాంతీయ భాషలకు ఈ ఫోన్‌లో సపోర్ట్‌ను అందిస్తున్నారు. 2000 కాంటాక్ట్‌లను స్టోర్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్‌లో 1.3 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాను ఏర్పాటు చేశారు. దానికి ఫ్లాష్ సౌకర్యం ఉంది. వైర్‌లెస్ ఎఫ్ఎం ఫీచర్ లభిస్తుంది. ఎఫ్ఎంను రికార్డు చేసుకోవచ్చు. ఆటోకాల్ రికార్డర్ సదుపాయం కూడా ఉంది. పెద్ద ఎల్ఈడీ టార్చి, వన్ టచ్ మ్యూట్, 8 ప్రీలోడెడ్ గేమ్స్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 1900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 24 రోజుల వరకు స్టాండ్ బై మోడ్‌లో ఉంటుంది.
ఐటెల్ మ్యాజిక్ 2 4జి ఫీచర్లు
- 2.4 ఇంచ్ క్యూవీజీఏ 3డి కర్వ్‌డ్ డిస్‌ప్లే
- వైఫై విత్ హాట్ స్పాట్, బ్లూటూత్ 2.0, 8 ప్రీలోడెడ్ గేమ్స్
- ఇంగ్లిష్, హిందీ, తెలుగు, గుజరాతీ, పంజాబీ, తమిళ్, బెంగాలీ, కన్నడ, మళయాళం భాషలకు సపోర్ట్
- కింగ్ వాయిస్, ఆటో కాల్ రికార్డర్, వన్ టచ్ మ్యూట్
- 1900 ఎంఏహెచ్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ
ఐటెల్ మ్యాజిక్ 2 4జి ఫీచర్ ఫోన్ బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ఈ ఫోన్ ధర రూ.2349గా ఉంది. దీనికి 100 రోజుల రీప్లేస్‌మెంట్ వారంటీ లభిస్తుంది. 12 నెలల గ్యారంటీ లభిస్తుంది.