వియరబుల్స్ ఉత్పత్తిదారు గోక్యూఐ చిన్నారుల కోసం కొత్తగా స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. గోక్యూఐ స్మార్ట్ వైటల్ జూనియర్ పేరిట ఆ వాచ్ విడుదలైంది. దీని సహాయంతో తల్లిదండ్రులు తమ చిన్నారుల ఆరోగ్య వివరాలను తెలుసుకోవచ్చు. ఈ వాచ్‌ను చిన్నారులకు ధరింపజేయాలి. దీంతో వారి బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలు, హార్ట్ రేట్ వివరాలు తెలుస్తాయి.
ఈ వాచ్ ద్వారా 18 రకాల యాక్టివిటీలను ట్రాక్ చేయవచ్చు. ఈ వాచ్ 1.3 ఇంచుల కలర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో వాచ్ ఫేస్‌లను మార్చుకోవచ్చు. స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ అయితే మ్యూజిక్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఫోన్ ఫైండర్ సదుపాయం ఉంది. దీనికి వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు.
ఈ వాచ్‌లో 230 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉంది. అందువల్ల ఈ వాచ్ 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఈ వాచ్ స్మాల్, మీడియం, లార్జ్ సైజుల్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.4,999గా ఉంది. ఈ వాచ్‌ను కొనుగోలు చేసిన వారికి గోక్యూఐ నుంచి 3 నెలల పాటు హెల్త్ కోచింగ్ ఇస్తారు. అన్ని ఈ-కామర్స్ సైట్లలో ఈ వాచ్ అందుబాటులో ఉంది.