సాయంత్ర సమయంలో ఏమైనా తినాలనిపిస్తే ఎంతో టేస్టీగా,తొందరగా తయారు చేసుకునే స్నాక్స్ లో బంగాళదుంప ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి. మరి రుచికరమైన క్రిస్పీ బంగాళదుంప ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*బంగాళదుంపలు పెద్దవి మూడు
*ఉప్పు రుచికి సరిపడా
*కారం తగినంత
*నీరు కావలసినన్ని
*చాట్ మసాలా టేబుల్ స్పూన్
*గరం మసాలా టేబుల్ స్పూన్
*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత
తయారీ విధానం
ముందుగా పీలర్ సహాయంతో బంగాళదుంపలను తొక్కతీసి పొడుగ్గా కట్ చేసుకోనీ నీటిలో వేసుకోవాలి. తర్వాత ఈ బంగాళాదుంప ముక్కలను సగం వరకు ఉడికించాలి. ఈ విధంగా బంగాళదుంప ముక్కలను వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ముక్కల మొత్తం తడి ఆరిపోయాక నూనెను వేడి చేసుకొని బాగా డీప్ ఫ్రై చేయాలి. ఈ వేడిగా ఉన్న బంగాళదుంప ముక్కలను ఒక గిన్నెలో తీసుకొని మన రుచికి సరిపడా ఉప్పు, కారం, చాట్ మసాలా, గరం మసాలా వేసి కలపాలి. ఈ వేడి వేడి గా ఉండే ఫ్రెంచ్ఫ్రైస్ ను టమాటో కెచప్ తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.