స్మార్ట్ ఫోన్లు అనేవి ప్రస్తుత తరుణంలో కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. వాటి వల్ల మనం అనేక పనులను చక్కబెట్టుకోగలుగుతున్నాం. బ్యాంకింగ్ వంటి పనులను చేసుకోగలుగుతున్నాం. ఇంకా ఎన్నో సౌకర్యాలను మనకు స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నాయి. అయితే కొన్ని సార్లు పలు కారణాల వల్ల ఫోన్లు నెమ్మదిగా పనిచేస్తుంటాయి. హ్యాంగ్ అవుతుంటాయి. అలాంటి సమయాల్లో కింద తెలిపిన సూచనలు పాటించాల్సి ఉంటుంది. దీంతో ఫోన్లు మళ్లీ వేగంగా, స్మూత్‌గా పనిచేస్తాయి. మరి ఆ సూచనలు ఏమిటంటే…
1. ఫోన్లలో యానిమేషన్లను ఆఫ్ చేయడం వల్ల ఫోన్ వేగం పెరుగుతుంది. అందుకు గాను ఫోన్‌లోని సెట్టింగ్స్ లోకి వెళ్లి అందులో అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ లో ఉండే రెడ్యూస్ యానిమేషన్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. శాంసంగ్ ఫోన్లలో ఇలా చేయవచ్చు. ఇక ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లు అయితే ముందుగా డెవలపర్ ఆప్షన్స్‌ను ఎనేబుల్ చేయాలి. అందుకు గాను సెట్టింగ్స్‌లో అబౌట్ ఫోన్ విభాగంలో బిల్డ్ నంబర్ అనే ఆప్షన్‌పై 7 సార్లు ట్యాప్ చేయాలి. దీంతో డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతుంది. సెట్టింగ్స్‌లో ఉండే డెవలపర్ ఆప్షన్స్‌లోకి వెళ్లి అక్కడ విండో యానిమేషన్ స్కేల్ రెడ్యూస్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ విలువను 0.5ఎక్స్‌కు తగ్గించాలి. లేదంటే పూర్తిగా ఆఫ్ చేయవచ్చు. దీంతో ఫోన్ వేగంగా పనిచేస్తుంది. స్మూత్‌గా ఆపరేట్ చేయవచ్చు.
2. ఫోన్లలో చాలా మంది అవసరం లేని యాప్స్‌ను వేస్తుంటారు. అలాగే వేలకొద్దీ ఫొటోలు, వీడియోలు, వాట్సాప్ చాట్‌లు సేవ్ అవుతుంటాయి. వీటి వల్ల ఫోన్ స్టోరేజ్ స్పేస్ తగ్గుతుంది. దీంతో ఫోన్ హ్యాంగ్ అవుతుంటుంది. కనుక అవసరం లేని యాప్స్‌ను, డేటాను డిలీట్ చేయాలి. ఇది ఫోన్ వేగాన్ని పెంచుతుంది.
3. ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ ను ఎక్కువగా చూసినా లేదా యూట్యూబ్‌లో వీడియోలను ఎక్కువగా వీక్షించినా ఫోన్‌లో క్యాచ్ స్టోరేజ్ అవుతుంది. ఇది ఒక్కోసారి 2జీబీ వరకు అవుతుంది. కనుక దీన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. అందుకు గాను ఫోన్‌లో సెట్టింగ్స్‌లోని స్టోరేజ్ విభాగంలో క్యాచ్‌డ్ డేటాకు వెళ్లాలి. అక్కడ డిలీట్ క్యాచ్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. దీంతో ఫోన్ క్యాచ్ క్లియర్ అవుతుంది. ఫోన్ వేగంగా పనిచేస్తుంది.
4. కొందరు ఫోన్లలో యానిమేషన్లతో కూడిన వాల్‌పేపర్లను వాడుతారు. ఇలా చేయడం వల్ల కూడా ఫోన్ పనితీరు మందగిస్తుంది. కనుక సాధారణ వాల్‌పేపర్లను ఉపయోగించాలి. దీంతో ఫోన్ వేగంగా పనిచేస్తుంది. స్మూత్‌గా ఆపరేట్ అవుతుంది.
5. ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ ఎందులో అయినా సరే హోం స్క్రీన్‌పై విడ్జెట్స్‌ను పెట్టుకునే సదుపాయం ఉంది. కానీ వీటి వల్ల ఫోన్ పెర్ఫార్మెన్స్ దెబ్బ తింటుంది. కనుక విడ్జెట్లను వీలైనంత వరకు వాడకపోవడమే ఉత్తమం.
6. పైన తెలిపిన ఆప్షన్లను ట్రై చేసినప్పటికీ ఫోన్ ఇంకా హ్యాంగ్ అవుతున్నా లేదా స్మూత్‌గా పనిచేయకున్నా.. ఫోన్‌ను ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌కు రీసెట్ చేయడం ఒక్కటే మార్గం. అలా కూడా ఫోన్ హ్యాంగ్ అవుతుంటే దాన్ని సర్వీస్ సెంటర్ లో చూపించాలి. కొన్ని సార్లు ఫోన్‌లలో వైరస్, మాల్‌వేర్ చేరడం వల్ల కూడా ఫోన్ హ్యాంగవుతుంది. ఇలా గనక జరుగుతున్నట్లు భావిస్తే ఫోన్‌లో యాంటీ వైరస్, యాంటీ మాల్‌వేర్ యాప్స్ వేసి ఫోన్‌ను క్షుణ్ణంగా స్కాన్ చేయాలి. దీంతో వైరస్‌లు, మాల్‌వేర్‌లు తొలగిపోతాయి. ఫోన్ ఎప్పటిలా మళ్లీ వేగంగా పనిచేస్తుంది. స్మూత్‌గా ఆపరేట్ చేయవచ్చు.