ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరో అద్భుతమైన సేల్‌ను త్వరలో నిర్వహించనుంది. ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది. ఇందులో అనేక రకాల ఉత్పత్తులపై తగ్గింపు ధరలను అందివ్వనున్నారు.
ఈ సేల్‌లో భాగంగా రెడ్‌మీ, ఎంఐ, రియల్‌మి, ఒప్పో, వివో, యాపిల్, శాంసంగ్ కంపెనీలకు చెందిన ఫోన్లను వినియోగదారులు తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలపై 80 శాతం వరకు తగ్గింపు ధరలను పొందవచ్చు.
టీవీలపై 75 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 50 నుంచి 80 శాతం వరకు తగ్గింపు ధరలను పొందవచ్చు. హోమ్ అండ్ కిచెన్ ఉత్పత్తులు ఈ సేల్‌లో రూ.99 ప్రారంభ ధర నుంచి లభ్యం కానున్నాయి. కాగా ఈ నెల 26, 27 తేదీల్లో అమెజాన్ కూడా తన ప్రైమ్ మెంబర్లకు మాత్రమే ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించనుంది.