ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ గురువారం ప్రారంభం కాగా ఆగస్టు 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు.
ఈ సేల్‌లో మొబైల్స్ పై 40 శాతం వరకు, హెడ్ ఫోన్స్ పై 70 శాతం వరకు, స్మార్ట్ వాచ్‌లపై 60 శాతం వరకు, ట్యాబ్‌లపై 45 శాతం వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్లపై అందుబాటులో ఉన్న డీల్స్ వివరాలు
- యాపిల్ ఐఫోన్ 12 ప్రొ 128 జీబీ – రూ.1,08,900 (రూ.11వేలు తగ్గింపు)
- యాపిల్ ఐఫోన్ 11 64జీబీ – రూ.48,999 (రూ.6901 తగ్గింపు)
- వన్‌ప్లస్ 9 5జి 6జీబీ + 128 జీబీ – రూ.45,999 (రూ.4వేలు తగ్గింపు)
- వన్‌ప్లస్ 9ఆర్ 5జి – రూ.37,999 (రూ.2000 తగ్గింపు)
- ఎంఐ 11ఎక్స్ 5జి 6జీబీ + 128 జీబీ – రూ.27,999 (రూ.2000 తగ్గింపు)
- శాంసంగ్ గెలాక్సీ ఎం42 5జి 6జీబీ + 128 జీబీ – రూ.20,999 (రూ.1000 తగ్గింపు)
- రెడ్‌మీ నోట్ 10 ప్రొ మ్యాక్స్ 6జీబీ + 128 జీబీ – రూ.18,999 (రూ.1000 తగ్గింపు)
- ఐక్యూ జడ్3 5జి 6జీబీ + 128 జీబీ – రూ.18,490 (రూ.1500 తగ్గింపు)
- ఒప్పో ఎఫ్17 6జీబీ + 128 జీబీ – రూ.14,990 (రూ.2000 తగ్గింపు)
- టెక్నో స్పార్క్ 7టి 4జీబీ + 64 జీబీ – రూ.8,599 (రూ.400 తగ్గింపు)
- రెడ్‌మీ 9ఎ – రూ.6,799 (రూ.500 తగ్గింపు)
- రియల్‌మి సి11 (2021) – రూ.6,699 (రూ.300 తగ్గింపు)
ఇక ఈ సేల్‌లో యాపిల్‌కు చెందిన ఐప్యాడ్ ఎయిర్ 2020 రూ.47,900 ప్రారంభ ధరకు లభిస్తోంది. ల్యాప్‌టాప్‌లు రూ.30వేల ప్రారంభ ధరకు లభిస్తున్నాయి. టీవీలపై 55 శాతం, స్మార్ట్ ఫోన్ కేసెస్‌పై 70 శాతం, ఇంటర్నల్ ఎస్ఎస్‌డీలు, మెమోరీలపై 40 శాతం, కెనాన్ కెమెరాలపై 24 శాతం వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నారు. అమెజాన్‌కు చెందిన Echo Dot (4th Gen, 2020) ధర రూ.1050 తగ్గి రూ. 3,449 ధరకు లభిస్తుండగా, Fire TV Stick (3rd Gen, 2021) ధర రూ.1200 తగ్గిం రూ.2,799 కు లభిస్తోంది. అలాగే Echo Dot (3rd Gen) రూ.1050 తగ్గి రూ.2,449 ధరకు, Fire TV Stick Lite (2020) రూ.700 తగ్గి రూ.2,299 ధరకు లభిస్తున్నాయి.
ఇక బోట్ బ్లూటూత్ స్పీకర్లు, సౌండ్ బార్‌లపై 75 శాతం వరకు రాయితీని అందిస్తున్నారు. సోనీ హెడ్ ఫోన్స్ ను 47 శాతం డిస్కౌంట్‌తో రూ.1024 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. వైర్డ్ ఇయర్ ఫోన్స్ పై 87 శాతం వరకు తగ్గింపు ధరను అందిస్తున్నారు.
హానర్ మ్యాజిక్ వాచ్ 2 ను రూ.6వేలు తగ్గింపుతో రూ.9,999 ధరకు, అమేజ్‌ఫిట్ టి-రెక్స్ ను రూ.3500 తగ్గింపు తో రూ.6499 ధరకు, అమేజ్‌ఫిట్ జీటీఎస్2 మినీ ని రూ.500 తగ్గింపుతో రూ.6499కు, అమేజ్ ఫిట్ బిప్ యు ప్రొ ను రూ.300 తగ్గింపుతో రూ.4699కు, వన్‌ప్లస్ స్మార్ట్ బ్యాండ్‌ను రూ.300 తగ్గింపుతో రూ.2199 ధరకు ఈ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు.