ఆడక ఆడక పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడుదామని న్యూజిలాండ్ ప్రిపేర్ అయి వచ్చింది. 18 ఏళ్ల తరువాత ఎట్టకేలకు పాక్ లో అడుగు పెట్టిన కివీస్ బ్యాట్స్ మెన్ మ్యాచ్‌లు ఆడేందుకు రెడీ అయ్యారు. శుక్రవారం రావల్పిండిలో మధ్యాహ్నం 3 గంటలకు మొదటి వన్డే మ్యాచ్ ప్రారంభం కావల్సి ఉంది. కానీ ఎంత సేపు వేచి చూసినా కివీస్ బ్యాట్స్ మెన్ మాత్రం హోటల్‌కే పరిమితం అయ్యారు. స్టేడియంకు రాలేదు.
న్యూజిలాండ్‌కు చెందిన సెక్యూరిటీ నిపుణుల సలహా మేరకు పాక్‌తో ఆడాల్సిన మ్యాచ్‌లను.. టూర్ మొత్తాన్ని రద్దు చేసుకుంటున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. దీంతో ప్లేయర్లు స్టేడియం వరకు రాకుండానే హోటల్ నుంచి అటు నుంచి అటే న్యూజిలాండ్‌కు ప్రయాణం కానున్నారు.
పాకిస్థాన్ తో నెలకొన్న అనేక వివాదాల కారణంగా ఇప్పటికే భారత్ మ్యాచ్ లను ఆడడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే పాక్‌తో భారత్ తలపడుతోంది. అయితే కొన్నేళ్ల కింద శ్రీలంక జట్టు పాక్‌లో ఆడేందుకు వెళ్లింది. కానీ వారు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగింది. అదృష్టవశాత్తూ అందులో ఎవరి ప్రాణాలు పోలేదు. కానీ అప్పటి నుంచి పాక్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జరగడం లేదు. ఇతర దేశాలు పాక్‌లో క్రికెట్ ఆడేందుకు భయ పడుతున్నాయి.
అయితే ఎట్టకేలకు న్యూజిలాండ్ పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు అంగీకరించింది. అందులో భాగంగానే మూడు వన్డేలు, 5 టీ20లు రావల్పిండి, లాహోర్‌లలో జరగనున్నాయి. ఈ టూర్‌లో భాగంగా మొదటి వన్డే శుక్రవారం ప్రారంభం కావల్సి ఉంది. కానీ కివీస్ ప్లేయర్లు హోటల్‌కే పరిమితం అయ్యారు. పాక్ భద్రతా విభాగం అధికారులు వారికి ఎంత నచ్చజెప్పినా వారు హోటల్‌ను వీడలేదు. మరోవైపు న్యూజిలాండ్ నుంచి భద్రతా విభాగం అధికారులు అలర్ట్ చేయడంతో ఇక కివీస్ ప్లేయర్లు టూర్ మొత్తం ఆడేదిలేదని, రద్దు చేసుకుంటున్నామని చెప్పారు. దీంతో ప్లేయర్లు స్టేడియంకు రాకుండానే టూర్ మొత్తం రద్దు అయింది.
నిజానికి పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరగక చాలా ఏళ్లు అవుతోంది. ఈ టూర్‌తో అయినా క్రికెట్‌కు అక్కడ పూర్వ వైభవం తెద్దామనుకున్నారు. కానీ సెక్యూరిటీ కారణంగా రద్దు అయింది. దీంతో ఏం చేయాలో తెలియక పాక్ క్రికెట్ బోర్డు తలలు పట్టుకుంటోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…