అహ్మదాబాద్‌లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 25వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఢిల్లీ అలవోకగా ఛేదించింది. ఇంకా కొన్ని బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడారు. దీంతో కోల్‌కతాపై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా కోల్‌కతా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్లలో ఆండ్రు రస్సెల్, శుబమన్ గిల్‌లు రాణించారు. 27 బంతులు ఆడిన రస్సెల్ 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 పరుగులు చేయగా, 38 బంతులు ఆడిన గిల్ 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 43 పరుగులు చేశాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్‌లు చెరో 2 వికెట్ల చొప్పున తీశారు. అవేష్ ఖాన్, మార్కస్ స్టాయినిస్‌లు చెరొక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 16.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో పృథ్వీ షా, శిఖర్ ధావన్‌లు అద్భుతంగా రాణించారు. 41 బంతుల్లోనే షా 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేయగా, 47 బంతుల్లో ధావన్ 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 46 పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ ఒక్కడే 3 వికెట్లు పడగొట్టాడు.