ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వేసవిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అలరించేందుకు సిద్ధమవుతోంది. కరోనా వల్ల గతేడాది వేసవిలో జరగాల్సిన ఐపీఎల్ 13వ ఎడిషన్‌ను వాయిదా వేసి సెప్టెంబర్ – నవంబర్ నెలల మధ్య దుబాయ్‌లో నిర్వహించారు. ఇక ఈసారి 14వ ఎడిషన్‌ను భారత్‌లోనే నిర్వహిస్తున్నారు. కాకపోతే ప్రేక్షకులు లేకుండానే ఈసారి ఐపీఎల్ జరగనుంది. ఈ క్రమంలో జట్లన్నీ ఇప్పటికే ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి.
అయితే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ చాలా రోజుల తరువాత తమ జట్టు ఆటగాళ్ల జెర్సీ లుక్‌ను మార్చింది. జెర్సీపై కొత్త కంపెనీలకు చెందిన స్పాన్సర్‌షిప్ లోగోలతోపాటు జెర్సీ భుజాలపై ఇండియన్ ఆర్మీ యూనిఫాంను ప్రతిబింబించే విధంగా డిజైన్ చేశారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ లోగోపై 3 స్టార్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఆ స్టార్స్ ఏమిటా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కానీ అందులో పెద్ద విషయం ఏమీ లేదు. చెన్నై ఇప్పటి వరకు మూడు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలిచింది కదా. 2010, 2011, 2018లలో ఐపీఎల్‌ను గెలుచుకుంది. దీంతో ఆ విజయాలను ప్రతిబింబించేలా ఆ 3 స్టార్స్‌ను లోగోలపై డిజైన్ చేశారు.
ఇక గత సీజన్‌లో చెన్నై టీమ్ చెత్త ప్రదర్శన చూపింది. మొత్తం 14 మ్యాచ్‌లలో కేవలం 6 మ్యాచ్‌లను మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. ఆ సీజన్‌లో ఐపీఎల్ ప్రారంభానికి ముందు వ్యక్తిగత కారణాలతో సురేష్ రైనా తప్పుకోవడం జట్టుకు మైనస్ అయింది. అయితే ఈసారి మాత్రం చెన్నై టీమ్ మునుపటిలా విజృంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి వారు ఆశిస్తున్నట్లు జరుగుతుందా, లేదా ? అన్నది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…