జీవితంలో సొంతంటి కలను నిజం చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. డబ్బులను ఒకేసారి చెల్లించి ఇల్లు కట్టుకునేవారు, కొనేవారు తక్కువ మంది ఉంటారు. చాలా మంది లోన్లను తీసుకుని ఇళ్లను కట్టడమో, కొనడమో చేస్తుంటారు. అందులో భాగంగానే అనేక ఆర్థిక సంస్థలు, బ్యాంకులు కస్టమర్లకు తక్కువ వడ్డీలకే ఇంటి రుణాలను అందిస్తున్నాయి. ఇక ప్రస్తుతం మార్కెట్ స్థితిగతులకు అనుగుణంగా పలు బ్యాంకులు తక్కువ వడ్డీకే ఇంటి రుణాలను అందిస్తున్నాయి. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోటక్ మహీంద్రా బ్యాంకు ఇంటి రుణాలపై 6.65 నుంచి 7.3 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. అదే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అయితే 6.7 నుంచి 7.2 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 6.7 నుంచి 8.05 శాతం, ఎస్‌బీఐ 6.75 నుంచి 8.2 వరకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు 6.8 నుంచి 8.9 వరకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.8 నుంచి 8.4 వరకు, బ్యాంక్ ఆఫ్ బరోడా 6.85 నుంచి 8.7 శాతం వరకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండాయా 6.85 నుంచి 9.05 వరకు, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 6.85 నుంచి 7.35 వరకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 6.9 నుంచి 9.65 శాతం వరకు ఇంటి రుణాలపై వడ్డీలను అందజేస్తున్నాయి.
ఇక ఈ రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కనుక ఇంటి రుణం పొందాలనుకునేవారు ఈ రేట్లను ఒకసారి మళ్లీ పరిశీలించి రుణం తీసుకోవడం మంచిది. అలాగే క్రెడిట్ హిస్టరీ సరిగ్గా ఉన్నవారు మాత్రమే రుణానికి దరఖాస్తు చేయాలి. లేదంటే రుణం మంజూరు కాకపోగా క్రెడిట్ స్కోరుపై ఆ ప్రభావం పడేందుకు అవకాశం ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…