కరోనా వల్ల అనేక మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయారు. అయినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మారింది కనుక మళ్లీ కంపెనీలు, పరిశ్రమలు ఉద్యోగాలు, ఉపాధిని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే కరోనా సమయంలోనూ కొన్ని రకాల పరిశ్రమలు, రంగాలకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. అందువల్ల అలాంటి రంగాల్లో ఉద్యోగాలను ఎంపిక చేసుకుంటే కెరీర్ నిశ్చింతగా ఉంటుంది. జాబ్ పోతుందనే భయం ఉండదు. అలాంటి రంగాల్లో FMCG రంగం కూడా ఒకటి. దీన్నే Fast Moving Consumer Goods రంగం అని కూడా అంటారు. అంటే పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువులకు కొంత కాల పరిమితి ఉంటుంది కదా. ఆ తేదీ దాటితే అవి ఎక్స్‌పైర్ అవుతాయి. అందువల్ల సమయంలోగానే వాటిని అమ్మాల్సి ఉంటుంది. దీంతో ఈ రంగానికి వినియోగదారుల నుంచి భారీ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మనం నిత్యం కొనే కిరాణా సరుకులు, కాస్మొటిక్స్ వంటివి ఈ కోవకే చెందుతాయి. ఈ రంగంలో ఉద్యోగులకు ముఖ్యంగా 5 రకాల ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే…
ఈ జాబ్‌లో ఉన్నవారు తమ కంపెనీలకు చెందిన స్టాక్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. వారు తమ కస్టమర్ల అభిరుచులు, ఇష్టాయిష్టాలు, తమ వద్ద వారు ఏమేం కొంటున్నారు ? అనే వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అందుకు అనుగుణంగా ఉత్పత్తులను తెచ్చి అందుబాటులో ఉంచాలి. ఇలా వీరు పనిచేస్తారు. ఈ జాబ్ చేసే వారికి పుష్కలంగా అవకాశాలు ఉంటాయి.
వీరు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్కెటింగ్ ప్లాన్లను అమలు చేయాలి. అమ్మకాలను పెంచాలి. కస్టమర్లు కొనే వస్తువుల ట్రెండ్‌ను పరిశీలించాలి. నిర్దిష్టమైన ప్రాంతంలో ఉన్న ప్రజలకు పబ్లిసిటీ అయ్యేలా మార్కెటింగ్ ఎలా చేయాలి ? అన్న వివరాలను వీరు ఆలోచిస్తారు. వాటిని అమలు చేసి కంపెనీలకు లాభాలను తెచ్చి పెడతారు.
తగిన స్టోర్‌కు సరైన ఉత్పత్తులను సకాలంలో చేరవేయడం వీరి పని. వీరు రిటెయిల్ ఔట్‌లెట్లకు అన్ని రకాల వస్తువులు సకాలంలో సరఫరా అవుతున్నాయా ? లేదా ? సప్లై ఎలా ఉంది ? అనే వివరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు సరుకులను సరఫరా చేస్తారు. ఇది చక్కని అవకాశాలు ఉన్న జాబ్ అని చెప్పవచ్చు.
ఎంబీఏ చేసిన వారు సాధారణంగా ఈ జాబ్ చేస్తారు. వీరు అన్ని రకాల కాస్ట్ సేవింగ్ పద్ధతులను పాటిస్తూ కంపెనీలకు ఖర్చులను తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచుతారు. ఇది కూడా చక్కని జాబ్. ఇందులోనూ ఉద్యోగులకు ఎంతో వృద్ధి ఉంటుంది.
వీరు అన్ని రిటెయిల్ ఔట్‌లెట్లను సమన్వయం చేసుకుంటూ అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతారు. క్వాలిటీ ఉన్న కస్టమర్ సర్వీస్ సేవలను అందిస్తారు. ఇన్వెంటరీని మేనేజ్ చేస్తారు. ఫైనాన్స్‌ను చూస్తారు. రిటెయిల్ స్టోర్ సైజ్‌ను బట్టి వీరు చేసే ఉద్యోగం మారుతుంది. కొన్ని సార్లు వీరు సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్, రిటెయిల్ సప్లై మేనేజ్‌మెంట్, స్టాక్ సెలెక్షన్ వంటి పనులు చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ ఇది కూడా చక్కని ఉద్యోగం అని చెప్పవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…