మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2021 రెండో దశ జరగనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలకు గట్టి షాక్ తగిలింది. పలువురు ఇంగ్లండ్ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడబోవడం లేదని తేల్చి చెప్పారు. ఇటీవల భారత్, ఇంగ్లండ్ ల మధ్య మాంచెస్టర్‌లో 5వ టెస్టు జరగాల్సి ఉంది. కానీ కోవిడ్ భయంతో భారత్ మ్యాచ్ ఆడేందుకు నిరాకరించింది. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మ్యాచ్‌ను రద్దు చేసింది.
అయితే 5వ టెస్టు మ్యాచ్‌ను భారత ఆడని కారణంగా ఇంగ్లండ్ క్రికెటర్లు ప్రతీకారం తీర్చుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు ఆడుతున్న జానీ బెయిర్ స్టో, క్రిస్ వోక్స్, డేవిడ్ మలన్‌లు ఈ దశ ఐపీఎల్‌లో ఆడబోవడం లేదని చెప్పారు. అయితే పంజాబ్ కింగ్స్ మాత్రం వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఎయిడెన్ మార్కరమ్‌ను రీప్లేస్‌మెంట్ కింద తీసుకుంది.
అయితే నిజానికి ఈ విషయంలో ఇంగ్లండ్ ప్లేయర్లను తప్పుపట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే బయో సెక్యూర్ బబుల్‌లో ఉండి కూడా కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలు వ్యవహరించారు. వారు హోటల్‌లో ఉండకుండా బయట పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. దీంతో కోచ్ శాస్త్రితోపాటు మరో ఇద్దరు సహాయక కోచ్‌లకు కోవిడ్ సోకింది. అయితే 5వ టెస్టుకు ముందు పరీక్షలు నిర్వహించగా అందరికీ కోవిడ్ నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ మ్యాచ్‌ను ఆడేందుకు కోహ్లి అండ్ కో నిరాకరించారు. దీంతో 5వ టెస్టు క్యాన్సిల్ అయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…