ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ అనే జిల్లాకు చెందిన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ (కలెక్టర్) వినీత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్, టి-షర్ట్‌లు వేసుకుని ఆఫీసులకు రావడం సరికాదని అన్నారు. అలా వారు చేస్తే డీసెన్సీ ఉండదని, ప్రజల్లోని ఉద్యోగుల పట్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. ఆయన తాజాగా ఈ విషయమై అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది.
అయితే గతంలో ఉధమ్ సింగ్ నగర్‌కు చెందిన కలెక్టర్ కూడా ఇలాగే ఆర్డర్ జారీ చేశారు. కానీ దాన్ని అమలు పరిచేలోగా ఆయన బదిలీ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు కలెక్టర్ వినీత్ కుమార్ ఈ విధంగా ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. జీన్స్, టి-షర్ట్‌లు వేసుకుని ఉద్యోగులు మీటింగ్ హాజరవడం, ఆఫీస్ కు రావడం వల్ల వారి డ్రెస్‌కు హుందాతనం ఉండదని, ఉన్న డీసెన్సీ పోతుందని, ప్రజల్లో చులకన అవుతామని ఆయన అన్నారు. అందువల్ల అందరూ ఫార్మల్స్ ధరించాలని సూచించారు.
అయితే ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ విధించడం నిజానికి కొత్తేమీ కాదు. బీహార్, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో ఇప్పటికే కొన్ని చోట్ల ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తున్నారు. అయితే కలెక్టర్ వినీత్ కుమార్ ఈవిధంగా ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. దీంతో ఆయనను చాలా మంది ప్రశంసిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…