సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. అధిక వేగంతో ప్రయాణిస్తున్న అతను అదుపుతప్పి కింద పడటంతో కన్ను, ఛాతి భాగం, భుజాలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటి ఐకియా వైపు వెళ్తుండగా జరిగింది. ఎంతో వేగంగా వెళ్తున్న సాయి తేజ్ రోడ్డుపై ఇసుక ఉన్న కారణంగా అదుపుతప్పి కింద పడినట్లు పోలీసులు వెల్లడించారు.
సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యాడన్న వార్త తెలియడంతో అటు మెగా కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే సాయి ధరమ్ తేజ్ కి ఎలాంటి ప్రమాదం లేదని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిసిన అభిమానులు అతను ఏ బైక్ నడుపుతున్నాడు, ఆ బైక్ ధర ఎంత.. అనేదానిపై అత్యుత్సాహం కనబరుస్తూ బండి గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలు పెట్టారు.
సాయి ధరమ్ తేజ్ ఉపయోగిస్తున్న బండి విషయానికి వస్తే ఈ బండిని గత కొన్ని నెలల క్రితమే హైదరాబాద్‌లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సాయి తేజ్ ఉపయోగించే బండి ట్రయంప్ ట్రైడెంట్ కాగా, ఈ బండి ఖరీదు సుమారు రూ.11 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది. 660 సీసీ ఇంజన్‌ను కలిగి ఉన్న హై ఎండ్ బైక్ సుమారు రెండు వందల కిలోల బరువు ఉంటుంది. అయితే గత కొన్ని నెలల క్రితమే సాయిధరమ్ తేజ్ ఈ స్పోర్ట్స్ బైక్ ను TS07 GJ1258 నంబర్ పై అనిల్ కుమార్ అనే పేరుతో రిజిస్ట్రేషన్ చేసి కొన్నట్టు తెలుస్తోంది. బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం ఉన్న సాయి తేజ్ ఎప్పటిలాగే శుక్రవారం తన స్పోర్ట్స్ బైక్ పై వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…