Train Tracks Stones : రైలు పట్టాల పక్కన మీరెప్పుడైనా నడిచారా..? నడిచాం.. అయితే ఏంటంటారా..? ఏమీ లేదండీ.. రైలు పట్టాల పక్కన కంకర రాళ్లపై నడుస్తుంటే నిజంగా అదోలాంటి ఫీలింగ్ కలుగుతుంది. యమ వేగంగా దూసుకువచ్చే రైళ్ల చప్పుడుకు ఆ సమయంలో హడలిపోతాం. అయినా ట్రాక్‌పై ఉండే రాళ్ల మీద నడవడం అంత ఆషామాషీ కాదు. అయితే.. నిజానికి అసలు ట్రెయిన్ ట్రాక్స్ మధ్యలో, పక్కన, చుట్టూ.. ఆ మాటకొస్తే ట్రాక్ మొత్తం కంకర రాళ్లతో ఎందుకు నిండి ఉంటుందో తెలుసా..? అసలు కంకర రాళ్లను ట్రాక్స్ కింద ఎందుకు పోస్తారో, వాటిని క్రమబద్ధంగా ఎందుకు అమరుస్తారో తెలుసా..? అదే తెలుసుకుందాం రండి..!
రైలు ట్రాక్ కింద, చుట్టూ ఉండే కంకర రాళ్లను బల్లాస్ట్ అంటారు. అయితే ఇప్పుడంటే ట్రాక్స్ మధ్యలో కాంక్రీట్ దిమ్మలను ఏర్పాటు చేస్తున్నారు కానీ, ఒకప్పుడు చెక్క దిమ్మలు ఉండేవి. ఈ క్రమంలో కాంక్రీట్ అయినా, చెక్క దిమ్మలైనా, వాటిని చిత్రంలో ఇచ్చిన విధంగా స్లీపర్స్‌తో ఒకదానికొకటి ఫిట్ చేస్తారు. దాంతోపాటు పట్టాలకు దిమ్మలను కూడా అమరుస్తారు. అయితే ఇలా అమర్చాక ఆ దిమ్మలు, పట్టాలు సరైన పొజిషన్‌లో ఉండేందుకు గాను చుట్టూ, కింద కంకర రాళ్లను పోసి వాటిని సమం చేస్తారు. దీంతో పట్టాలు, దిమ్మలు, స్లీపర్స్ ఒకే స్థానంలో ఫిక్స్ అయి ఉంటాయి. అవి అటు, ఇటు కదలవు.
మరి.. పట్టాల పక్కన కూడా కంకర రాళ్లను పోస్తారు కదా.. అంటే అందుకూ కారణం ఉంది. సాధారణంగా రైల్వే ట్రాక్ మొత్తం భూమిపై కొంత ఎత్తులో కంకర రాళ్ల మీద ఏర్పాటు చేయబడి ఉంటుంది. దానికి తోడు ట్రాక్స్ పక్కన ఎత్తుగా కంకరను పోస్తారు. అలా పోయడం వల్ల వర్షం పడిన నీరు సులభంగా భూమిలోకి వెళ్లిపోతుంది. ట్రాక్‌పై నీరు నిలవదు. దీంతో రైళ్లు సులభంగా వెళ్లవచ్చు. వరదకు ట్రాక్ కొట్టుకుపోకుండా ఉండేందుకు కూడా అలా కంకర రాళ్లను ఏర్పాటు చేస్తారు. అలా చేయడం వల్ల మొక్కలు కూడా పెరగవు. కింద చెత్త పేరుకుపోదు. ట్రాక్స్ క్లియర్‌గా కనిపిస్తాయి. అందుకనే రైల్వే ట్రాక్స్ కింద, చుట్టూ అంతా కంకర రాళ్లను ఏర్పాటు చేస్తారు. ఇవీ.. దాని వెనుక ఉన్న అసలు కారణాలు..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…