ఆఫ్‌బీట్

Kaliyugam : క‌లియుగం అంతం అవుతుంద‌ని చెప్ప‌డానికి సంకేతాలు ఇవే..!

Kaliyugam : ప్ర‌స్తుతం మ‌నం అంద‌రం ఉన్న‌ది క‌లియుగంలోనేన‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ యుగంలోనే యుగాంతం వ‌స్తుంద‌ని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌లియుగంలో మనుషులు ఉన్నతస్థానానికి చేరుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారని, అందుకు అవ‌స‌ర‌మైతే అడ్డదారులు కూడా తొక్కుతారని, వయసు, ఎత్తు, బలం, జ్ఞానం, ఆకర్షణ వంటివన్నీ రానురాను కలియుగంలో తగ్గిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అవ‌న్నీ జ‌ర‌గ‌డం కూడా మ‌నం చూస్తున్నాం. అయితే వేదాలు కూడా క‌లియుగం గురించిన కొన్ని నిజాల‌ను మ‌న‌కు చెబుతున్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

క‌లియుగంలో నిజం అనేది చ‌నిపోతుంది. మ‌నుషులు నిజం చెప్ప‌డం అనేది మానేస్తారు. అబ‌ద్దాల మీద‌నే ప్ర‌పంచం న‌డుస్తుంది. నిజం చెప్పే ఏ మ‌నిషి కూడా క‌లియుగంలో ఉండ‌లేడు. ఉండ‌డు కూడా. మ‌నుషుల్లో మంచిత‌నం అనేది అస్స‌లు ఉండ‌దు. అది చూద్దామ‌న్నా ఏ కోశానా క‌నిపించదు. ఎక్కడో కోటికొక్క‌రు మంచి, మాన‌వ‌త్వం ఉన్న‌వారు ఉంటారు. ఒక మనిషికి ఉన్న గుణ గ‌ణాలు, పేరు కాక అత‌నికి ఉండే ఆస్తి అంటేనే ఇత‌రులు ఎక్కువ‌గా విలువ‌నిస్తారు. డ‌బ్బును బ‌ట్టే మ‌నిషి గుణ గ‌ణాల‌ను నిర్ణ‌యిస్తారు. ఆలు, మ‌గ‌ల మ‌ధ్య నిజ‌మైన ప్రేమ కొర‌వడుతుంది. వారి మ‌ధ్య ఉండేది కేవ‌లం ఆక‌ర్ష‌ణ మాత్ర‌మే. ఇది వారి మ‌ధ్య ఉన్న సంబంధాల‌ను దెబ్బ తీస్తుంది.

క‌లియుగంలో త‌ల్లిదండ్రుల‌ను మోసం చేసే పిల్ల‌లు, పిల్ల‌ల‌ను మోసం చేసే త‌ల్లిదండ్రులు ఉంటారు. మ‌తాలు, కులాలు, వ‌ర్గాల పేరుతో మోసాలు జ‌రుగుతాయి. వాటిని అడ్డం పెట్టుకుని కొంద‌రు ఎంత‌టి దుర్మార్గానికైనా పాల్ప‌డుతారు. డ‌బ్బే ప్ర‌పంచంగా మారుతుంది. మనుషులు తోటి మ‌నుషుల క‌న్నా డబ్బుకే ఎక్కువ విలువనిస్తారు. అందులోనే బ‌తుకుతారు. డ‌బ్బున్న వారిదే రాజ్యం అవుతుంది. డ‌బ్బు కోసం బంధువులను, తోటి కుటుంబ స‌భ్యుల‌ను చంపేందుకు కూడా వెనుకాడ‌రు. దొంగ‌లు, దోపిడీదారులు, మోసాలు చేసేవారు, రౌడీలు, గూండాలు రాజ్య‌మేలుతారు. పాల‌కులుగా మారి ప్ర‌జ‌ల‌ను ప‌ట్టి పీడిస్తారు. వారు తాము చేసిందే శాస‌నం అన్న‌ట్టుగా నియంతృత్వ పాల‌న సాగిస్తారు.

వృద్ధులైన అమ్మానాన్న‌ల‌ను పిల్ల‌లు ప‌ట్టించుకోరు. వారిని నిర్ల‌క్ష్యం చేస్తారు. అస్స‌లు లెక్క చేయ‌రు. క‌లియుగం అంతం అవుతుంద‌న‌గా ఆవులు ఉండ‌వు. చ‌నిపోతాయి. ఎవ‌రికీ క‌రుణ ఉండ‌దు. ఒక‌రినొకరు చంపుకునేదాకా వ‌స్తుంది. అంద‌రూ చేప‌లు మాత్ర‌మే తింటారు. మ‌హిళ‌లు చాలా క్రూరంగా ప్ర‌వ‌ర్తిస్తారు. ఎక్క‌డ చూసినా వ్య‌భిచారం, హ‌త్య‌లు జ‌రుగుతాయి. మ‌నిషి జీవిత కాలం 15 ఏళ్ల‌కు ప‌డిపోతుంది. చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌ల‌ను కంటారు. ఎక్క‌డా ఆల‌యాలు ఉండ‌వు. క‌నుమ‌రుగైపోతాయి. భూమిపై వేడి పెరిగిపోతుంది. అందుకు జీవ‌రాశులు త‌ట్టుకోలేక చ‌నిపోతాయి. దుర్మార్గులంద‌రూ హ‌త‌మ‌వుతారు. ప్ర‌ళ‌యం వ‌చ్చి భూమిపై అంతా ఎటు చూసినా నీరే ద‌ర్శ‌న‌మిస్తుంది. అప్పుడు తిరిగి స‌త్య యుగం ప్రారంభ‌మ‌వుతుంది.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM