Nail Biting : గోర్లు కొరకడం చాలా మందికి ఉండే అలవాటు. చిన్నారులే కాదు, కొందరు పెద్దలు కూడా గోర్లను పదే పదే కొరుకుతుంటారు. అయితే నిజానికి గోర్లను కొరకడమనేది చాలా చెడు అలవాటు. అది ఎవరికైనా అస్సలు ఉండకూడదు. ఈ క్రమంలో అసలు ఎవరైనా గోర్లను ఎందుకు కొరుకుతారో మీకు తెలుసా..? పలువురు సైంటిస్టులు, పరిశోధకులు ఇదే విషయంపై స్టడీ చేశారు. అసలు మనం గోర్లను ఎందుకు కొరుకుతామన్న దానికి వారు కొన్ని సమాధానాలు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దామా.
సిగ్నండ్ ఫ్రాయిడ్ అనే ప్రముఖ న్యూరాలజిస్ట్ గోర్లను కొరకడం వెనుక ఉన్న కారణాన్ని ఏమని చెబుతున్నారంటే.. కొందరికి తప్పు చేశామనే భావన మనస్సులో ఉంటుందట. అందుకే వారు దాన్ని అణచుకోలేక పదే పదే గోర్లను కొరుకుతారట. ఏదో తప్పు చేశామన్న భావన ఉన్నవారు ఎక్కువగా ఇలాగే చేస్తారట. బోర్ ఫీలవుతున్న వారు లేదంటే ఒత్తిడి, ఆందోళనలకు గురవుతున్నవారు గోర్లను ఎక్కువగా కొరుకుతారట. దాంతో వారి మెదడు కొంత రిలాక్స్ చెందుతుందట. అబ్‌సెస్సివ్ కంపల్షన్ డిజార్డర్ (ఓసీడీ), ఏడీహెచ్‌డీ, ఓడీడీ వంటి మానసిక వ్యాధులతో బాధపడేవారు కూడా గోర్లను కొరుకుతారట. ఆ సమయంలో వారికి ఏం చేయాలో తెలియకే అలా చేస్తారట.
తమ గోర్లు నీట్‌గా, అందంగా లేకపోతే ఎదుటి వారు ఏమైనా అంటారేమోనన్న భావనతో కూడా కొందరు గోర్లను కొరుకుతారట. పైన చెప్పిన కారణాలు కాకున్నప్పటికీ కొందరికి గోర్లు కొరకడం ఒక అలవాటుగా మారుతుందట. ఉదాహరణకు సిగరెట్, మద్యం తాగడం లాంటివి. అయితే కారణం ఏదైనప్పటికీ ఎవరూ గోర్లను కొరకకూడదు. దాంతో గోర్ల నుంచి బాక్టీరియా, వైరస్‌లు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ తరువాత ఎలాంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కనుక గోర్లను కొరకడం మానేస్తేనే మంచిది. లేదంటే అనవసరంగా రోగాలను కొని తెచ్చుకున్న వారవుతారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…