Death : మనిషి పుట్టిన తరువాత ఎప్పుడు చనిపోతాడో ఎవరూ చెప్పలేరు. అయితే చనిపోతారని తెలిసిన వ్యక్తుల వద్ద ఉండే వారికి చనిపోయే వారిలో ఏయే లక్షణాలు ఉంటాయో తెలిసేందుకు అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలకు శాస్త్రీయత లేకున్నా అంతిమ ఘడియల్లో ఉన్న వారిలో సాధారణంగా కొన్ని లక్షణాలు మనకు కామన్‌గా కనిపిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చావుకు దగ్గరవుతున్న వారిలో ఆకలి ఎక్కువగా ఉండదు. ఏ ఆహారం ఇచ్చినా దాన్ని తిరస్కరిస్తారు. అంతేకాదు వారికి ఇష్టమైన ఆహారం ఇచ్చినా దాన్ని తినరు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఇబ్బంది పెట్టవద్దు.
చావు సమీపిస్తున్న వారు ఎక్కువగా వణుకుతారు. అది ఎండాకాలమైనా, చలికాలమైనా తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఈ సమయంలో వారికి వెచ్చని దుస్తులను ఇవ్వాలి. మరణం దగ్గర పడుతున్న వారి గొంతు నుంచి అదో రకమైన జీర ధ్వని వినిపిస్తుంది. దీంతోపాటు గురకలాంటి ధ్వని నిరంతరం వస్తూ ఉంటుంది. కొంత మంది చనిపోయిన తమ పూర్వీకులు తమ ముందే ఉన్నారని, తమతో మాట్లాడుతున్నారని చెబుతారు. ఈ సూచన కూడా చావు దగ్గర పడుతుండడాన్ని ప్రతిబింబిస్తుంది.
కొంత మంది తమ గదిలో తమతోపాటు యమధర్మ రాజు కూడా ఉన్నాడని చెబుతారు. ఇది కూడా చావు దగ్గర పడుతుండడాన్ని సూచిస్తుంది. కేవలం ఇంకొన్ని నిమిషాల్లో చనిపోతారనగా వారికి కేవలం తెలుపు రంగులో ఉండే ఓ కాంతి మాత్రమే కనిపిస్తుందని, అప్పుడు వారి చెవులు మాత్రమే వినిపిస్తాయని చెబుతారు. అయితే వీటిల్లో నిజాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ.. వీటి గురించి మాత్రం తరచూ చెబుతుంటారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…