Marriage : భారతీయ సాంప్రదాయాల్లో వివాహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక జంటను ఒక్కటిగా చేసే ఈ శుభకార్యం తరువాత నిర్వహించే తొలిరాత్రిని కూడా మన దగ్గర పవిత్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే తొలి రాత్రికి ముందు కొన్ని ఆచారాలను పాటించడం పలు వర్గాల్లో ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. అలాంటి ఆచారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుంకుమ పువ్వు కలిపిన పాలను వధువు చేతికిచ్చి తొలిరాత్రి గదిలోకి పంపించడం హిందూ వివాహ వేడుకలో ఎక్కువగా చూస్తుంటాం. దీని వల్ల ఆ పాలతో దంపతులిద్దరికీ శక్తి కలిగి వారి సంసారం బాగుంటుందని విశ్వసిస్తారు.
కొన్ని భారత సాంప్రదాయాల్లో తొలిరాత్రి ముందు దంపతులిద్దరికీ తినేందుకు పాన్ ఇస్తారు. ఎందుకంటే పాన్ నోటిని శుభ్రం చేసి అందులోని క్రిములను తొలగిస్తుంది. అంతేకాదు నోటిని తాజాగా ఉంచి దంపతులిద్దరూ సువాసనతో మెలిగేలా చేస్తుంది. ఇప్పుడు చెప్పబోయేది అత్యంత పురాతనమైన దుర్మార్గపు ఆచారం. చెప్పుకోడానికి ఇబ్బందిగా ఉంటుంది, కానీ దీన్ని ఇప్పటికీ పలు ప్రాంతాల్లో పాటిస్తున్నారు. అదేమిటంటే, తొలిరాత్రి తరువాత వధువు అత్త దంపతుల గదిని పరిశీలించి దుప్పట్లపై రక్తపు మరకలు ఉన్నాయో లేదో చూస్తుంది. ఒకవేళ ఉంటే ఆ వధువు కన్యే అని అర్థం చేసుకుంటారు.
కొన్ని సాంప్రదాయాల్లో తొలి రాత్రి రోజున కొత్త బెడ్‌షీట్‌పై దంపతుల కలయికను ఏర్పాటు చేస్తారు. అనంతరం తెల్లవారు జామున వధువు అత్త ఆ బెడ్‌షీట్‌ను పరీక్షించి పైన చెప్పినట్టుగా కోడలి కన్యత్వాన్ని ధృవపరుచుకుంటుంది. అనంతరం దాంతో దేవునికి ప్రార్థన చేసి ఉతకడం కోసం ఇస్తారు. కాల్ రాత్రి అనే ఆచారాన్ని బెంగాలీలు పాటిస్తారు. వీరిలో నూతన దంపతులు తొలిరాత్రికి ముందు రోజు రాత్రి వేర్వేరు గదుల్లో పడుకుంటారు. కనీసం ఒకరి ముఖాన్ని ఒకరు కూడా చూడరు. తెల్లవారుజామున వధువు తన తల్లిగారింటికి వెళ్తుంది. తాను సరైన వ్యక్తితోనే జీవితంలో ముందుకు వెళ్తున్నానని తల్లితో చెప్పి విషయాన్ని ధృవపరుస్తుంది. ఆ రోజే తొలిరాత్రి నిర్వహిస్తారు.
ఈ ఆచారాన్ని మనలో అధిక శాతం మంది పాటిస్తారు. తొలి రాత్రి దంపతులు గడపబోయే గదిని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. ఎందుకంటే పువ్వుల నుంచి వచ్చే సువాసనల్లాగానే వారి జీవితంలో కూడా పరిమళాలు వికసించాలని, జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని. అంతేకాదు, ఆ పువ్వుల వల్ల గదిలో పూర్తి శృంగారభరితమైన వాతావరణం ఏర్పడుతుంది. అందుకనే అలా అలంకరణ చేస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…