ఆరోగ్యం

Cancer : ఈ లక్షణాలను బట్టి పురుషుల్లో వచ్చే క్యాన్సర్‌లను ముందుగానే గుర్తించవచ్చు..!

Cancer : క్యాన్సర్.. నేడు ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న రోగాల్లో ఇది కూడా ఒకటి. కారణాలేమున్నా క్యాన్సర్ సోకితే దాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేస్తే అందుకు తగ్గ ఫలితం ఉంటుంది. లేదంటే అది ప్రాణాంతకంగా మారుతుంది. కింద ఇచ్చిన పలు లక్షణాలను పరిశీలించడం ద్వారా ప్రధానంగా పురుషుల్లో వచ్చే క్యాన్సర్‌లను ముందుగానే గుర్తించవచ్చు. ఆ లక్షణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మంలో అకస్మాత్తు మార్పులు, రక్తస్రావం అవడం, మచ్చల వంటివి ఎక్కువ కాలం ఉంటే ప్రమాదకరంగా మారవచ్చు. అంతే కాదు ఇవి చర్మ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంటుంది. అలసట, ఆయాసం ఎక్కువగా, ఎక్కువ సేపు ఉంటే అది పెద్దపేగు లేదా పొట్టకు సంబంధించిన క్యాన్సర్ అయి ఉండొచ్చు. మగవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ దాని లక్షణాలను పరిశీలించాల్సిందే. ఛాతి చుట్టూ ఎరుపుదనం, నిపుల్స్ నుంచి డిశ్చార్జి వంటి లక్షణాలు ఉంటే దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్‌గా పరిగణించాలి.

నోట్లో లేదా నాలుకపై తెల్లని ప్యాచ్‌లు ఎక్కువ కాలం పాటు ఉంటే అది ప్రమాదకరమైన ఓరల్ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంటుంది. ఎక్కువగా జ్వరం వచ్చి అది అలాగే కొద్ది నెలల పాటు ఉంటే దాన్ని బ్లడ్ క్యాన్సర్‌కు సూచనగా భావించాలి. కడుపులో ఎల్లప్పుడూ నొప్పిగా ఉండడంతోపాటు ఎప్పుడూ డిప్రెషన్‌లో ఉంటే దాన్ని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌గా అనుమానించాలి. ఆహారాన్ని మింగడంలో ఎల్లప్పుడూ ఇబ్బందిగా ఉంటే అది గ్యాస్ట్రో ఇంటెస్టయినల్ క్యాన్సర్ కావచ్చు.

లింఫ్ గ్రంథులు లేదా గొంతు-మెడభాగంలో ఎల్లప్పుడూ ఉబ్బి ఉన్నా దాన్ని గొంతు క్యాన్సర్‌గా అనుమానించాలి. వృషణాల సైజ్‌లో మార్పు, వాపు, భారంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటే దాన్ని వృషణాల క్యాన్సర్‌గా భావించాలి. మ్యూకస్ లేదా ఉమ్మిలో రక్తం వస్తుంటే దాన్ని ఊపిరితిత్తులు లేదా ఓరల్ క్యాన్సర్‌గా భావించాలి. మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తున్నా ఆ పరిస్థితిని ప్రోస్టేట్ క్యాన్సర్‌గా అనుమానించాలి.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM