సాధారణంగా మనలో ఎవరూ కూడా ఇతరులు తింటున్న తిండిని షేర్ చేసుకుని తినేందుకు ఇష్టపడరు. అంతేకాదు ఒకరు వాడిన స్పూన్లు, ప్లేట్లలో కూడా మరొకరు తినరు. అయితే బయటి వ్యక్తులు వాడిన వాటి సంగతి పక్కన పెడితే మన స్నేహితులు, కుటుంబ సభ్యులు, దగ్గరి వారు ఒకరు తినేవి మరొకరు లాక్కుని తినడం (ఎంగిలి) సహజంగా జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో వారి ప్లేట్లను, స్పూన్లను ఇంకొకరు ఉపయోగిస్తుంటారు కూడా. అయితే ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇతరుల తిండిని తినడం, వారు తిండికి ఉపయోగించిన వస్తువులను వాడడం వంటివి చేస్తే వారి ఉమ్మిలో నుంచి బాక్టీరియా ఎదుటి వారి శరీరంలోకి వెళ్లేందుకు అవకాశం ఉంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. అవలక్షణాలున్నవారు తినే ఆహారాన్ని, బాటిల్స్, స్పూన్స్ వంటి వస్తువులను ఇతరులు తీసుకుంటే ఆ అవలక్షణాలన్నీ ఎదుటి వారికి కూడా సంక్రమిస్తాయని విశ్వసిస్తారు. మెక్సికో వంటి దేశాల్లో ఒకరు తినే ఆహారాన్ని, అందుకోసం ఉపయోగించే వస్తువులను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం తప్పేమీ కాదు. ఇది వారిండ్లలో చిన్న పిల్లలు ఉంటేనే వర్తిస్తుంది. వారు పెరిగి పెద్దవారైతే ఒకరి వస్తువులను, ఆహారాన్ని మరొకరు తీసుకోకూడదని చెబుతారు. ఎందుకంటే ఇతరుల ఆహారాన్ని, వస్తువులను తీసుకుంటే ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నట్టు అవుతుందని అర్థం అట. కనుక అలా చేయరు.
కొత్తగా పెళ్లయిన వారికి, నూతన దంపతులకు వివాహ సందర్భంలో, లేదా వేరే ఎక్కడ డిన్నర్‌లోనైనా ఒకరి భోజనం మరొకరితో షేర్ చేసుకోమని, ఒకరికొకరు తినిపించుకోమని చెబుతారు. ఎందుకంటే వారి మధ్య బంధం మరింత బలపడాలని అంటారు. అయితే పెళ్లి కూతురు తిన్న ఎంగిలి ఆహారాన్ని ఎవరైనా తింటే వారికి త్వరగా పెళ్లవుతుందని కొంత మంది నమ్ముతారు. తిండి కోసం ఒకరు వాడిన వస్తువులను మరొకరు వాడడం అనారోగ్యకరమైన చర్యగా భావిస్తారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఒకరు ఉపయోగించిన వాటిని మరొకరు వాడకూడదు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…