ఈ ఆధునిక ప్రపంచంలో నిత్యం మనం అనేక వ్యాధులతో సతమతం అవుతున్నాం. మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్లే మనకు అనేక అనారోగ్యాలు వస్తున్నాయి. అలాగే నిత్యం మనం తిరిగే వాతావరణం, కాలుష్యం వల్ల కూడా వ్యాధులు వస్తున్నాయి. అందువల్ల నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం నివసించలేని పరిస్థితి నెలకొంది.
అయితే నగరాలు, పట్టణాల్లో నివసిస్తే ఎంతటి ప్రమాదకరమో అతనికి జరిగిన సంఘటన మనకు చాటి చెబుతుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
1972లో వియత్నాంలో యుద్ధం జరగడం వల్ల హో వాన్ లాంగ్ ను తన తండ్రి అడవిలోకి తీసుకెళ్లాడు. ఆ తరువాత అక్కడి కువాంగ్ గాయ్ ప్రావిన్స్ లో ఉన్న టే ట్రా జిల్లాలోని దట్టమైన అడవిలో ఆ ఇద్దరూ నివాసం ఉన్నారు. ఈ క్రమంలోనే 2013లో లాంగ్ తండ్రి చనిపోయాడు. తరువాత 4 ఏళ్లకు.. అంటే 2017లో లాంగ్ సిటీకి మకాం మార్చాడు.
అయితే అడవిలో ఉన్నప్పుడు స్వచ్ఛమైన వాతావరణం ఉండేది. చక్కని ఆహారం తినేవాడు. కానీ సిటీకి వచ్చాక లైఫ్ స్టైల్ మారిపోయింది. లాంగ్ ఎక్కువగా మద్యం సేవించేవాడు. ప్రాసెస్ చేయబడిన ఆహారాలను ఎక్కువగా తినేవాడు. దీంతో అతనికి లివర్ క్యాన్సర్ వచ్చింది. ఈ క్రమంలో అతను ఇటీవలే మృతి చెందాడు.
అలా అతను 41 ఏళ్ల పాటు అడవిలో ఉన్నా అతనికి ఏమీ కాలేదు. కానీ కేవలం 4 ఏళ్లు సిటీలో ఉండి జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేసుకున్నాడు. దీంతో లివర్ క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. అందుకనే సహజసిద్ధమైన ప్రకృతిలో నివసిస్తే ఎక్కువ కాలం పాటు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండవచ్చని నిపుణులు చెబుతుంటారు. అది ఇతని విషయంలో అక్షరాలా నిజమే అనిపిస్తుంది కదా..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…