క్రైమ్‌

భార్యను చిత్రహింసలకు గురి చేసిన భర్త.. నరకం అంటే ఏమిటో చూపించాడు.. చివరకు ఏమైందంటే ?

సాధారణంగా పెళ్ళి అయిన తర్వాత ప్రతి ఒక్క భర్త తనకు సంతానం కలగాలని తన భార్యను ఎంతో ఉన్నతంగా చూసుకోవాలని భావిస్తాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. పెళ్లి అయిన తరువాత తన భార్యకు నరకం అంటే ఏమిటో చూపించాడు. దీంతో అతని చిత్ర హింసలను తట్టుకోలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు అతన్ని కటకటాల వెనక్కి పంపించారు. వివరాల్లోకి వెళితే..

విజయవాడకు చెందిన జోత్స్న అనే యువతి ఎంబీఏ చదివి బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ఆ సమయంలోనే సుశాంత్ చౌదరి అనే వ్యక్తి జోత్స్నను ప్రేమించి తన ప్రేమ విషయాన్ని ఆమెకు తెలియజేశాడు. అందుకు జోత్స్న ఒప్పుకోకపోవడంతో అతను చనిపోతానని బెదిరించాడు. దీంతో ఆమె ఆ ప్రేమను అంగీకరించాల్సి వచ్చింది. అయితే ఇద్దరూ ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో వారి పెళ్లి విషయం వారి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు వీరిద్దరికీ ఎంతో అంగరంగ వైభవంగా వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.  యువతి తల్లిదండ్రులు పెద్దఎత్తున కట్న కానుకలను సమర్పించారు.

ఈ విధంగా పెళ్లి తర్వాత బెంగళూరులో నివాసమున్న ఈ జంట కొన్ని రోజులకు సుశాంత్ చౌదరి గ్రామానికి వచ్చారు. ఎప్పుడైతే జోత్స్న అత్తారింట్లో నివాసం ఉంటుందో అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఎవరో మాంత్రికుడు తన ఇంటి వారసులను బలిస్తే వారికి లంకెబిందెలు దొరుకుతాయని చెప్పడంతో కుటుంబ సభ్యులు మొత్తం ఆమెపై అధిక ఒత్తిడి తెచ్చి పిల్లల్ని కనాలని తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవారు. ఇదే విషయమే తన తల్లిదండ్రులతో చెప్పడం వల్ల తల్లిదండ్రులు మందలించి వీరిద్దరిని బెంగళూరుకు పంపించారు. అక్కడికి వెళ్లినప్పటికీ ఆమెకు ఏమాత్రం బాధలు తప్పలేదు. ఈ క్రమంలోనే సుశాంత్ చౌదరి నువ్వు పిల్లల్ని కనిస్తావా.. లేకపోతే నేను మరొకరితో పిల్లల్ని కనాలా.. అంటూ ఆమెను తరచూ చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో జోత్స్న తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకొని పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM