ప్రమాదాలు అనేవి చెప్ప జరగవు. అనుకోకుండానే జరుగుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఘోరమైన ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కానీ అలాంటి ఘటనల్లో బతికి బట్టకట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టే బతికిపోయారు.. అని మనం అనుకుంటుంటాం. కొందరు అలా లక్ కలసి రావడం వల్ల బతికిపోతుంటారు. సరిగ్గా అక్కడ కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
గుజరాత్‌లోని దాహోద్‌లో ఉన్న గోధ్రా – ఝాలోద్ జాతీయ రహదారిపై ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సును ఓవర్ టేక్ చేయబోయిన ఓ ద్విచక్ర వాహనదారుడు దానికి ముందుకు వచ్చి ముందు టైర్ల కింద పడ్డాడు. ఈ క్రమంలో బైక్ దూరంగా పడిపోయింది. అయితే అతని వేగం బస్సు వేగం కన్నా ఎక్కువ ఉంది. దీంతో బస్సు కింద పడినా అతను టైర్ల కింద నలగలేదు. టైర్లతోపాటు ముందుకు అలాగే వచ్చాడు. దీంతో బస్సు డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో అతను టైర్ల వద్ద ఉండిపోయాడు.
తరువాత అతనే నెమ్మదిగా లేచి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఇతర వాహనదారులు కొందరు అతని బైక్‌ను తీసి పక్కన పెట్టారు. అయితే అంతటి ప్రమాదం జరిగినప్పటికీ ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న ఆ వ్యక్తికి ఏమీ కాలేదు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డాడు. అలాగే లక్ కలసి వచ్చింది. లేదంటే టైర్ల కింద నలిగిపోయి ఉండేవాడు.
కాగా అదే సమయంలో అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో ఈ సంఘటన తాలూకు దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వాహనదారుడు నిజంగా అదృష్టవంతుడేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…