సూర్య నటించిన గజిని సినిమా గుర్తుంది కదా. అందులో హీరోకు షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ ఉంటుంది. కొన్ని నిమిషాల తరువాత అంతకు ముందు జరిగింది ఏదీ అతనికి గుర్తుండదు. అయితే ఇలాంటి సంఘటనలు సినిమాల్లోనే జరుగుతాయి.. అనుకుంటే పొరపాటు. ఎందుకంటే నిజ జీవితంలోనూ సరిగ్గా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
డానియెల్ పోర్టర్ అనే వ్యక్తి 2020లో ఓ రోజు ఉదయం నిద్ర లేచాక పక్కన పడుకుని ఉన్న తన భార్య రూత్‌ను గుర్తు పట్టలేదు. ఆమె ఎవరో దారి తప్పి వచ్చి తన ఇంట్లో తన బెడ్ మీద పడకుందని అనుకున్నాడు. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. ఆమెను కూడా అతను గుర్తు పట్టలేదు. అంతేకాదు, 20 ఏళ్లుగా జరిగిన ఏ సంఘటనను కూడా గుర్తుంచుకోలేదు. తాను ఉంటున్నది ఇంకా 1999వ సంవత్సరమే అని అతను అనుకుంటున్నాడు. తనకు పెళ్లయిందీ, జాబ్ వచ్చింది, కుమార్తె జన్మించిందీ.. అతనికి ఏదీ గుర్తు లేదు.
దీంతో రూత్ తన భర్తను హాస్పిటల్‌లో చేర్పించింది. పరీక్షలు చేసిన వైద్యులు అతనికి ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీషియా అనే నాడీ సంబంధ సమస్య వచ్చిందని తెలిపారు. అప్పటి నుంచి అతనికి వైద్యులు థెరపీ ఇస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.
కాగా డానియెల్ జాబ్ సడెన్‌గా పోయిందని, దీంతో పెద్ద ఎత్తున ఆర్థిక సమస్యలు వచ్చాయని, వాటిని తట్టేకోలేక అతని మెదడు షాక్‌కు గురైందని, అందుకనే ఈ సమస్య వచ్చి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇక అతనికి ఎప్పుడు నయమవుతుందా ? అని అతని కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…