పెళ్లంటే నూరేళ్ల పంట. కానీ కొందరి జీవితాలు మధ్యలోనే తెగతెంపులు అవుతుంటాయి. అందుకు ఒక్కోసారి భార్యా భర్తల్లో ఎవరో ఒకరు కారణమవుతారు. కొన్ని సార్లు ఇద్దరూ కారణమవుతారు. అయితే ఆ ఇద్దరి విషయంలో భార్యదే పైచేయి అయింది. కానీ ఆమె తన భర్త గురించి చేసిన ఆరోపణలు అన్నీ తప్పుడువేనని తేలడంతో హైకోర్టు ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించి అతనికి, అతని భార్యకు విడాకులను మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే..
హర్యానాలోని హిసార్ అనే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి, అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళకు 2012 ఏప్రిల్ నెలలో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె జన్మించింది. అయితే 2016వ సంవత్సరంలో ఆ మహిళ తన భర్తను విడిచిపెట్టింది. వేరేగా ఉండడం మొదలు పెట్టింది. ఆ వ్యక్తి బ్యాంకు ఉద్యోగి కాగా, ఆమె టీచర్‌గా పనిచేస్తోంది.
అయితే ఆమె భర్త నుంచి విడిపోయాక అతనిపై వేధింపుల కేసు పెట్టింది. అతను, అతని కుటుంబ సభ్యులు నిత్యం తనను వేధించే వారని చెప్పింది. అయితే విచారణలో మాత్రం అదంతా అబద్ధమని తేలింది. నిజానికి ఆమెను పెళ్లయ్యాక భర్తే బాగా డబ్బు ఖర్చు పెట్టి ఉన్నత చదువులు చదివించాడు. ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు. పైగా ఆమే అతన్ని నిత్యం వేధించేది. కుటుంబ సభ్యుల ఎదుట అతన్ని విమర్శించేది.
ఇక భర్త నుంచి విడిపోయేటప్పుడు ఆమె తన కుమార్తెను కూడా అతని వద్దే వదిలేసింది. అప్పటి నుంచి తన కుమార్తెను చూసేందుకు ఒక్కసారి కూడా ఆమె ముందుకు రాలేదు. కోర్టు ఈ వివరాలను తెలుసుకుంది. ఇక పెళ్లి కాక ముందు తాను 74 కిలోల బరువు ఉండేవాడినని, భార్య పెట్టే టార్చర్ భరించలేక 21 కిలోలు తగ్గానని, దీంతో తన బరువు 53 కిలోలకు చేరుకుందని, తనపై తన భార్య చేస్తున్న ఆరోపణలు అన్నీ అబద్దాలేనని అతను కోర్టులో తెలిపాడు. దీంతో తప్పంతా ఆమెదేనని, అతను నిర్దోషి అని, ఏ తప్పు చేయలేదని, అతనిపై అతని భార్య చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవాలేనని కోర్టు తేల్చింది. దీంతో అతన్ని విడిచి పెట్టడంతోపాటు అతను దరఖాస్తు పెట్టుకున్న విధంగా అతనికి, అతని భార్యకు విడాకులను మంజూరు చేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…