మనకు అందుబాటులో ఉన్న తీపి పదార్థాల్లో ముఖ్యమైనవి మూడు. ఒకటి చక్కెర. రెండు బెల్లం. మూడు పటిక బెల్లం. తీపి పదార్థాలను తగ్గించుకోవాలని, చక్కెరకు బదులుగా బెల్లంను ఎక్కువగా ఉపయోగించాలని చెబుతుంటారు. బెల్లంను సహజసిద్ధంగా తయారు చేస్తారు కనుక చక్కెరకు బదులుగా దాన్ని తినాలని సూచిస్తుంటారు. ఇక ఆయుర్వేద వైద్యంలో పటిక బెల్లానికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. అయితే ఈ మూడింటి మధ్య ఉండే తేడాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చెరుకు నుంచి చక్కెర, బెల్లం, పటిక బెల్లం.. మూడింటినీ తయారు చేస్తారు. కానీ చక్కెరను బాగా శుద్ధి చేసిన చెరుకు రసం నుంచి తయారు చేస్తారు. అది కృత్రిమంగా సాగే ప్రక్రియ. అందులో పోషకాలు నష్టపోతాము. అందువల్లే చక్కెరను తినరాదని చెబుతారు. ఇక చెరుకు రసాన్ని బాగా వేడి చేసి, మరిగించి బెల్లాన్ని తయారు చేస్తారు. ఇది చాలా సహజసిద్ధమైన ప్రక్రియ. కనుక బెల్లాన్ని తినవచ్చు.
అయితే పటిక బెల్లాన్ని కూడా చెరుకు నుంచే తయారు చేస్తారు. కానీ పటిక బెల్లం అనేది శుద్ధి చేయబడని ముడి చక్కెర రూపం. దీన్ని వంటల్లోనూ, ఆరోగ్యకర ప్రయోజనాల కోసం వాడతారు. పటికబెల్లం శరీరానికి చలువ చేస్తుంది. జీర్ణశక్తిని పెంచి దేహానికి బలాన్ని, వీర్యపుష్టిని ఇస్తుంది. వాత, పిత్త , కఫ దోషాల వల్ల కలిగే అనేక రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది. అయితే తియ్యగా ఉందికదా అని ఎక్కువ తింటే మాత్రం మలబద్దకం వస్తుంది. కనుక పటిక బెల్లాన్ని మోతాదులోనే తీసుకోవాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…