సినీ ప్రేక్షకులు భిన్న రకాలుగా ఉంటారు. కొందరికి కామెడీ మూవీలు అంటే ఇష్టం ఉంటుంది. కొందరు యాక్షన్ మూవీలను ఇష్టపడతారు. కొందరికి రొమాంటిక్ మూవీలు నచ్చుతాయి. అయితే హార్రర్ మూవీలు అంటే ఇష్టం ఉండే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారికి ఆ కంపెనీ బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. అదేమిటంటే..
ఫైనాన్స్ బజ్ అనే కంపెనీ హార్రర్ మూవీలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఆ ప్రేక్షకులు 10 రోజుల్లో 13 హార్రర్ మూవీలను చూడాల్సి ఉంటుంది. దీంతో రూ.95వేలు ఇస్తారు. ఇక ఒక్కో మూవీకి అయ్యే రెంటల్ ఖర్చుల కింద రూ.3600 వరకు ఇస్తారు. 10 రోజుల్లో వారు సూచించిన 13 హార్రర్ మూవీలను చూడాల్సి ఉంటుంది.
మూవీలను చూసే సమయంలో వారు అందించే ఫిట్ నెస్ బ్యాండ్‌ను చేతికి ధరించాలి. దీంతో వారు ప్రేక్షకులకు చెందిన హార్ట్ బీట్‌ను తెలుసుకుంటారు. మూవీ చూస్తున్నప్పుడు భిన్న సమయాల్లో హార్ట్ రేట్‌ను తెలుసుకుంటారు. ఆ డేటాను వారు తమ అవసరాలకు వినియోగించుకుంటారు.
ఇక ప్రేక్షకులు చూడాల్సిన మూవీలలో సా, అమిటివిల్లె హార్రర్, ఎ క్వయిట్ ప్లేస్, ఎ క్వయిట్ ప్లేస్ పార్ట్ 2, క్యాండీ మ్యాన్, ఇన్‌సైడియస్, ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్, సినిస్టర్, గెటవుట్, ది పర్జ్, హాలోవీన్ (2018), పారానార్మల్ యాక్టివిటీ, అన్నాబెల్ వంటి మూవీలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే దరఖాస్తుకు సెప్టెంబర్ 26వ తేదీ వరకు గడువు ఉంది. 18 ఏళ్లు నిండిన వారు, అమెరికాలో ఉంటున్న వారు ఇందులో పాల్గొనవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…