ప్రస్తుతం కస్టమర్లకు ఎన్నో పోస్టాఫీస్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే కస్టమర్లకు మరి కొన్ని పథకాలను పోస్టాఫీస్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఏదైనా అమౌంట్ విత్ డ్రా చేయాలన్నా, డిపాజిట్ చేయాలన్నా కస్టమర్లు పోస్టాఫీస్ కు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కస్టమర్ లు బ్రాంచ్ కి వెళ్ళకుండా ఈ సేవలను ఎంతో సులభంగా పొందవచ్చు. అయితే ఈ సేవలు అందరికీ వర్తించవు.
పోస్టాఫీస్ ఈ సేవలను వికలాంగులు, సీనియర్ సిటిజన్ లకు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్స్, సేవింగ్స్ అకౌంట్స్ వంటి పలు స్మాల్ సేవింగ్స్ డిపాజిట్ ల నుంచి డబ్బులను విత్‌డ్రా చేసుకోవడం లేదా క్లోజ్ చేయడం వంటివి ఇకపై ఎంతో సులభంగా చేసుకోవచ్చు.
ఇంతకు మునుపు ఈ విధమైన సేవలు లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఈ సేవలను పొందాలంటే ముందుగా పోస్టాఫీస్ కి వెళ్లి ఫామ్ ఎస్‌బీ 12ని నింపి సంబంధిత అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. మీ తరపున లావాదేవీలను నిర్వహించడానికి మరొక అధికారిని నియమిస్తారు. ఈ అధికారి సమక్షంలో మీ ఆర్థిక లావాదేవీల ట్రాన్సాక్షన్స్ వాళ్లే చూసుకుంటారు. కనుక ఈ సరికొత్త పథకం ద్వారా సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు తరచూ పోస్టాఫీస్ బ్రాంచ్ చుట్టూ తిరిగే శ్రమ ఉండదని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…