జంతువులకు కొత్తగా ఏదైనా వస్తువు కనిపిస్తే అవి మొదట వాటి వద్దకు వెళ్లేందుకు భయపడతాయి. తరువాత నెమ్మదిగా వాటి వద్దకు చేరుకుంటాయి. అవి ఏవైనా ఆట వస్తువులు, క్రీడా వస్తువులు అయితే వాటితో అవి ఆడుకుంటాయి. ఇలాంటి సంఘటనలకు చెందిన వీడియోలను ఇప్పటికే మనం ఎన్నింటినో చూశాం. అయితే తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో ఉన్న ఉమర్‌కోట్ ప్రాంతంలోని సుకిగావ్ అనే ఏరియాలో అటవీ ప్రాంతంలో రెండు ఎలుగు బంట్లకు ఒక ఫుట్ బాల్ కనిపించింది. దీంతో అవి దాంతో ఆడుకోవడం మొదలు పెట్టాయి. ఎలుగుబంట్లు సరదాగా ఫుట్ బాల్ ఆడుతుండడాన్ని గమనించిన స్థానికులు వాటిని వీడియో తీశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీటియో వైరల్‌గా మారింది.
ఆ వీడియోను పోస్ట్ చేశాక కొన్ని గంటల్లోనే దానికి 20వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ క్రమంలోనే నెటిజన్లు ఆ వీడియోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు పలు కామెంట్లు కూడా పెట్టారు. ప్రభుత్వాలు సరిగ్గా ప్రోత్సహించాలే కానీ జంతువులు కూడా ఆటలు ఆడుతూ ఒలంపిక్స్ లో గెలుస్తాయని కొందరు కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియోను చాలా మంది షేర్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…